Ind vs SA: టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా శుభారంభం చేసింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరువనంతపురంలో జరిగిన ఇండియా-దక్షణాఫ్రికా టీ20 తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లో కెప్టెన్ బవుమా, రెండవ ఓవర్‌లో డికాక్ అవుటయ్యారు. అంటే రెండవ ఓవర్ ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత అర్షదీప్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు పడగొట్టడంతో..దక్షిణాఫ్రికా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తరువాత పార్నెల్, కేశవ్ మహారాజ్ నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. 


107 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ ఇండియాకు కూడా ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా, కాస్సేపటికి విరాట్ కోహ్లి అవుటయ్యాడు. అయితే కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్‌లు ప్రారంభంలో నిలకడగా ఆడుతూ..చివర్లో చెలరేగారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి.. 107 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 


Also read: Suryakumar Yadav: కోహ్లీ, బాబర్‌ను అధిగమించి.. సూర్యకుమార్ ఆల్‌టైం గ్రేటెస్ట్‌ బ్యాటర్‌గా ఎదుగుతాడు: పాక్‌ మాజీ ప్లేయర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook