Jasprit Bumrah: పాకిస్తాన్ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా.. అత్యంత చెత్త రికార్డుతో బూమ్రా షేమ్
India New Record: భారత్- ఆస్ట్రేలియా టీట్వంటీ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో రోహిత్ సేన సూపర్ విక్టరీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ ల్లో చెరొకటి గెలవడంతో హైదరాబాద్ మ్యాచ్ కీలకంగా మారింది.
India New Record: భారత్- ఆస్ట్రేలియా టీట్వంటీ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో రోహిత్ సేన సూపర్ విక్టరీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ ల్లో చెరొకటి గెలవడంతో హైదరాబాద్ మ్యాచ్ కీలకంగా మారింది. సిరిస్ గెలవాలనే కసితో ఆడిన భారత జట్టు.. అద్భుత ప్రదర్శనతో కంగారులను చిత్తు చేసింది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. 187 పరుగుల టార్గెట్ ను చేధించిన టీమిండియా ఆ మ్యాచ్ లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
హైదరాబాద్ విజయంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డ్ స్పష్టించింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో గెలిచిన టీమిండియాకు ఈ క్యాలెండర్ ఇయర్ టీట్వంటీల్లో ఇది 21వ విజయం. గతంలో క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా పాకిస్తాన్ పై రికార్డ్ ఉంది. 2021లో ఆ జట్టు 20 టీట్వంటీ మ్యాచ్ లు గెలిచింది. పాకిస్తాన్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ఉప్పల్ మ్యాచ్ లో బద్దలు కొట్టింది భారత జట్టు.
ఆసీస్ తో జరిగిన మ్యాచ్ భారత్ విజయం సాధించినా.. పేస్ బౌలర్ జస్పిత్ బూమ్రా మాత్రం తన టీట్వంటీ కెరీర్ లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన బూమ్రా ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఇదే అతని కేరీర్ లో అత్యంత చెత్త రికార్డ్. గతంలో 2016లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఇదే అతని బ్యాడ్ రికార్డ్. హైదరాబాద్ మ్యాచ్ ఆ చెత్త రికార్డ్ ను క్రాస్ చేశాడు జస్ప్రిత్ బూమ్రా.
Also read:Viral Video: పాఠశాలలో విద్యార్థుల పాడు పని..ఫైర్ అవుతున్న నెటిజన్లు..!
Also read:IND vs AUS: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook