ICC Test rankings: టెస్టుల్లో టాప్-10లో ముగ్గురు మనోళ్లే.. అశ్విన్‌కు అగ్రస్థానం..
Ravichandran Ashwin: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 853 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
ICC latest Test rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అశ్విన్ మరోసారి టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ 6 వికెట్లు తీశాడు. దీంతో అతడికి 853 పాయింట్లు లభించాయి. భారత బౌలర్లలో బుమ్రా నాలుగో స్థానంలోనూ, జడేజా ఆరో ర్యాంకులోనూ కొనసాగుతున్నారు.
సఫారీ బౌలర్ కగిసో రబడా 851 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ కు, జడేజాకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే తేడా. గతంలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ..తాజాగా ఒక ర్యాంకును కోల్పోయి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 825 పాయింట్లతో బుమ్రా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్ విభాగంలో.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కేన్ మామ 864 పాయింట్లతో టాప్ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 832 పాయింట్లతో రెండో స్థానంలోనూ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. డారిల్ మిఛెల్, బాబర్ ఆజమ్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలించారు. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఆరో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 12వ ర్యాంకులో ఉన్నాడు.
Also Read: U19 World Cup 2024: వరల్డ్ కప్‌లో ఎదురులేని యువ భారత్.. కివీస్ పై ఘన విజయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి