హాంగ్ కాంగ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అక్కడ ఏం చేశారో తెలుసా ?
హాంగ్ కాంగ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు
ఆసియా కప్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా నిన్న జరిగిన 4వ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడిన టీమిండియా ఆటగాళ్లు ఆట పూర్తయిన తర్వాత చేసిన ఓ పని వారిలోని క్రీడా స్పూర్తిని చాటింది. హాంగ్ కాంగ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి వరకు పోరాడిన టీమిండియా ఆఖరికి 26 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడామనే నిరాశలో ఉన్న హాంగ్ కాంగ్ జట్టు ఆటగాళ్లున్న డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అక్కడ హాంగ్ కాంగ్ ఆటగాళ్లతో సరదాగా కాసేపు ముచ్చటించి వారి ఆట శైలిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారితో కలిసి ఆప్యాయంగా ఫోటోలు తీసుకున్న రోహిత్ సేన తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. శభాష్ టీమిండియా.. దటీజ్ స్పోర్టివ్ స్పిరిట్!