Gongadi Trisha: భారత క్రికెట్ జట్టులోకి త్రిష.. మిథాలీ రాజ్ తర్వాత అరుదైన ఘనత!
Gongadi Trisha get a chance in india Women’s team after Mithali Raj. భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష భారత అండర్ 19 జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు.
Telangana Girl Gongadi Trisha included in India Women U19 Team vs New Zealand: తెలంగాణ అమ్మాయికి జాతీయ మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కింది. భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష.. భారత అండర్ 19 జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టులో త్రిష చోటు సంపాదించారు. దీంతో తెలంగాణ నుంచి మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ తర్వాత భారత జట్టులో స్థానం దక్కించుకొన్న క్రీడాకారిణిగా త్రిష అరుదైన ఘనత సాధించారు.
గొంగడి త్రిష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి. ఎనిమిదేళ్ల వయసులో అండర్ 16 క్రికెట్ జట్టుకు ఆడిన త్రిష.. మరో నాలుగేళ్లకే దేశీయంగా అండర్ 19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టులో 12 ఏళ్లకే స్థానం సంపాదించిన త్రిష.. బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నారు. జైపుర్ వేదికగా జరిగిన అండర్ 19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ 2021లో త్రిష ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు.
గొంగడి త్రిష బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్‌గా అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా త్రిష అరుదైన రికార్డును నమోదు చేయడం గమనార్హం. భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ నవంబర్ 27న ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా వ్యహరిస్తున్నారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న తొలి మహిళల అండర్ 19 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి.
భారత U19 మహిళల జట్టు:
శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), శిఖా షాలోట్, త్రిష జి, సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), సోనియా మెహదియా, హర్లీ గాలా, హృషితా బసు (కీపర్), నందిని కశ్యప్ (కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ ఎండీ.
Also Read: అచ్చు చిన్న పిల్లల మాదిరే.. క్యాప్‌తో ఆడుకున్న 16 అడుగుల కింగ్ కోబ్రా! వీడియో చివరివరకు చూడండి
Also Read: Kriti Sanon Pics: గ్లామర్ గేట్లు ఎత్తేసిన కృతి సనన్.. నెవర్ బిఫోర్ పిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.