IPL 2022: ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని మూడు జట్లు.. ఈ సరైన టైటిల్ గెలుస్తాయా..??
ఐపీఎల్ లో ఇప్పటివరకు మొత్తం 14 ఎడిషన్లు జరిగాయి. ఇందులో కేవలం ఆరు జట్లు మాత్రమే టైటిళ్లను సాధించాయి. అయితే అన్ని సీజన్లలో ఆడిన ఓ మూడు జట్లు మాత్రం అంతిమ విజయాన్ని ఇంకా రుచి చూడలేదు. మరి ఆ మూడు జట్లేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Trophy not lifted teams in IPL: ఐపీఎల్- అత్యంత క్లాస్ట్ లీ ప్రీమియర్ లీగ్ గా పేరుపొందింది. ప్రతిభ కలిగిన ప్లేయర్లకు కాసుల వర్షం కురిపించే ఈ లీగ్ కోసం కేవలం భారత్ లోనే కాదు.. యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఐపీఎల్ 15వ ఎడిషన్.. మెగా లీగ్ మార్చి 26న ప్రారంభమై.. మే 29న ముగుస్తుంది. 65 రోజుల పాటు ఐపీఎల్ ఫీవర్ కొనసాగనుంది. ఈ నెల 26న వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య బ్లాక్ బస్టర్ క్లాష్ జరగనుంది. ఐపీఎల్ 2022లో 70 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ లో ఇప్పటివరకు 14 సీజన్లు జరిగాయి. అత్యధిక టైటిళ్లు సాధించిన రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. 2013,2015,2017,2019,2020 సీజన్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై 5 సార్లు టైటిల్ లిఫ్ట్ చేసింది. తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 2010,2011,2018,2021 సీజన్ లలో సీఎస్ కే జట్టు నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ 2012,2014లో, రాజస్థాన్ రాయల్స్ 2008లో, డెక్కన్ ఛార్జర్స్ 2009లో, సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో టైటిల్ గెలుచుకున్నాయి.
ఇక ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ ఒక్కసారి కూడా గెలవని జట్లు మూడు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు.. ఫైనల్ వరకు వచ్చినప్పటికీ టైటిల్ ను మాత్రం గెలవలేకపోయాయి. ఈ మూడు జట్లు మాత్రం ఇప్పటివరకు జరిగిన 14 సీజన్లలో ఆడాయి. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేకపోయాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ కు వెళ్లింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2011లో చెన్నై చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 2016లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీ మట్టి కరిపించింది. దీంతో ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేకపోయింది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 2014లో ఫైనల్ కు చేరింది. కోల్ కతా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ పంజాబ్ జట్టు ఫైనల్ కు చేరుకోలేకపోయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా 2020లో ఫైనల్ వరకు వచ్చినా.. ఓటమిపాలైంది. ఢిల్లీపై.. ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ ఆరంభం నాటి నుంచి ఈ మూడు జట్లు ప్రతి సీజన్ లో ఆడుతున్నప్పటికీ అంతిమ విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. ఈ 2022 సీజన్ లోనైనా ఈ మూడు జట్లలోంచి ఏదైనా ఒక టీం విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook