India beat Indonesia with 3-0 to win maiden Thomas Cup title: బ్యాడ్మింటన్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు తొలిసారి విజేత‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆదివారం జరిగిన థామస్‌ కప్‌ టోర్నీ ఫైనల్లో పటిష్ట ఇండోనేషియాను భార‌త్ 3-0 తేడాతో చిత్తుచేసి స్వ‌ర్ణాన్ని ముద్దాడింది. 14 సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన‌ ఇండోనేషియా.. ఫైనల్లో భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ముందు తలవంచక తప్పలేదు. ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శనతో బ్యాడ్మింటన్‌లో భారత్ ఎట్టకేలకు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైనల్లోని తొలి మ్యాచ్‌లో యువ ఆటగాడు లక్ష్య సేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఒలింపిక్స్‌ పతక విజేత ఆంథోనీ గింటింగ్‌పై విజయం  సాధించాడు. తొలి సెట్‌ను కోల్పోయి మరీ లక్ష్య సేన్ జయకేతనం ఎగురవేసి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత జరిగిన డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్ శెట్టి ద్వయం 18-21, 23-21, 21-19తో మహ్మద్‌ అహసన్‌-సంజయ సుకమౌల్జో జోడిపై గెలుపొందారు. దీంతో భారత్ 2-0 తేడాతో ఇండోనేషియాపై ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.


ఫైనల్లోని ఆఖరిదైన మూడో గేమ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 23-21 తేడాతో వరుస సెట్లలో జొనాతన్‌ క్రిస్టీని ఓడించాడు. దాంతో 3-0 ఆధిక్యంతో థామస్‌ కప్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. థామ‌స్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో మొత్తం రెండు డ‌బుల్స్, మూడు సింగిల్ మ్యాచ్‌లు ఉండ‌గా.. వ‌రుస‌గా మూడింటిలోనూ గెలిచిన భార‌త్ కప్ కైవసం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తలపడాల్సిన అవసరం లేకుండా పోయింది. సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్.. డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్, ధృవ్ కపిల జోడీ రంగంలోకి దిగాల్సిన అవసరం లేకుండా పోయింది. 


Also Read: Shashank Singh Catch: బౌండరీ లైన్‌ వద్ద శశాంక్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన అజింక్య రహానే! సచిన్ పొగడ్తలు


Also Read: Andrew Symonds Death: ఆండ్రూ సైమండ్స్ మృతి.. హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే! భజ్జీ కెరీర్‌లో చేదు అనుభవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.