T20 World Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అమ్మకానికి టీ20 వరల్డ్ కప్ టికెట్లు..
T20 World Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ టికెట్లు విక్రయానికి ఉంచినట్లు ఐసీసీ ప్రకటించింది.
T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరిగే పురుషుల టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2022) టిక్కెట్లు అమ్మకానికి ఉంచినట్లు ఐసీసీ (ICC) తెలిపింది. అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ ఈవెంట్ కోసం టికెట్లను అందుబాటులో ఉంచింది. ఈ టికెట్ ధరలను (Ticket Rates) పిల్లలకు 5 డాలర్లు(రూ.374), పెద్దలకు 20 డాలర్లుగా (దాదాపు రూ.1495) నిర్ణయించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం నుండి t20worldcup.com వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా (Australia) ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. ఏడు మైదానాల్లో మొత్తంగా 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాల్లో మ్యాచ్ లను నిర్వహించనున్నారు. సెమీఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్, ఓవల్ వేదికగా నవంబర్ 9, 10న జరుగుతాయి. ఫైనల్, నవంబర్ 13న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరగనుంది.
Also Read: Shahid Kapoor trolled: 'క్రికెటర్‌గా సినిమా తీస్తూ.. క్రికెట్‌పై కనీస అవగాహన లేదా?'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook