IPL: ఐపీఎల్​ రెండో దశ కోసం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టులో భారీ మార్పులు చేసింది. కోచ్​ సహా పలువురు కీలక ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని భర్తీ చేసింది. న్యూజిలాండ్​ ఆటగాడు ఫిన్​ అలెన్(Finn Allen)​ స్థానంలో సింగపూర్​ ఆటగాడు టిమ్​ డేవిడ్​ను ​తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డేవిడ్‌(Tim David)తో పాటు శ్రీలంక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ హసరంగ, పేసర్‌ చమీరలను ఆర్‌సీబీ(RCB) తీసుకుంది. ఇక జట్టు ప్రధాన కోచ్‌ సైమన్‌ కాటిచ్‌(Simon Katich) వైదొలిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌గా వ్యవహరిస్తున్న మైక్‌ హెస్సన్‌(Mike Hesson) కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టిమ్​ డేవిడ్(Tim David) పేరు వెలుగులోకి వచ్చినప్పుటి నుంచి అభిమానులు అతని గురించి ఆన్ లైన్ లో వెతకడం ప్రారంభించారు. ఆర్​సీబీ కీలకంగా భావిస్తున్న ఈ సింగపూర్​ ఆటగాడు.. ఐపీఎల్​(IPL)లో ఆడటం ఇదే తొలిసారి. 


Also Read: IPL 2021: పూల్ వాలీబాల్ ఆడిన Mumbai Indians


టిమ్​ డేవిడ్..ఇతను 1996 మార్చి 16న జన్మించాడు. ​ఇప్పటివరకు అంతర్జాతీయంగా 14 టీ20లు ఆడాడు. వీటిలో నాలుగు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. 46.50 సగటుతో 558 పరుగులు చేశాడు. టిమ్.. 158.52తో అత్యధిక​ టీ20 స్ట్రైక్​ రేట్​ను నమోదు చేశాడు. లిస్ట్​ ఏ మ్యాచ్​లు, రాయల్​ లండన్ వన్​డే కప్​ 2021లతో టిమ్​కు గుర్తింపు వచ్చింది. రాయల్​ వన్​డే కప్​లో వరుసగా మూడు మ్యాచ్​లలో 140*, 52*, 102 పరుగులు చేశాడు. 15 లిస్ట్​ఏ మ్యాచ్​లు అడిన టిమ్​.. 709 పరుగులు చేశాడు. టిమ్​ ఇప్పటికే పలు దేశీయ టోర్నీలకు ఆడుతున్నాడు. బిగ్​బాష్​ లీగ్(Big Bash League), కరీబియన్​ ప్రీమియర్​ లీగ్(Caribbean Premier League)​, పాకిస్థాన్ సూపర్​ లీగ్​(PSL)లలో టిమ్​ ఆటగాడిగా కొనసాగాడు. టిమ్​ తండ్రి రోడెరిక్​ డేవిడ్​ కూడా సింగపూర్​కు క్రికెటర్​గా సేవలు అందించారు.


కీలక ఆటగాళ్లు దూరం
పలువురు స్టార్ ఆటగాళ్లు కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ 2021 రెండో దశకు అందుబాటులో ఉండడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్ (Pat Cummins), కేన్ రిచర్డ్ సన్, అడమ్ జంపా, జై రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్‌,  ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్(Jose Butler), జోఫ్రా ఆర్చర్(Jofra Archer), బెన్ స్టోక్స్(Ben Stokes) లీగ్ కు దూరమయ్యారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook