Indian boyfriend proposing his girlfriend at SCG Stadium during India vs Netherlands Match: స్టేడియంలో ఓ వైపు రసవత్తరంగా మ్యాచ్​లు జరుగుతుంటే.. మరోవైపు స్టాండ్స్​లో ఉన్న ప్రేమికులు ప్రపోజ్​ చేసుకోవడం ఈ మధ్య చాలా కామన్ అయింది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలను ఎక్కువగానే చూస్తున్నాం. గతంలో ఎక్కువగా ఫుట్​బాల్​ లీగ్​లకే పరిమితమైన ఈ సంప్రదాయం.. ఇప్పుడు క్రికెట్​కూ పాకింది. స్టాండ్స్​లో ప్రేమికులు ప్రపోజ్​ చేసుకోవడం ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో జరుగుతుంటాయి. తాజాగా మరో ఘటన కంగారూ దేశంలోనే చోటుచేసుకుంది. భారత్, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఓ భారత ఫ్యాన్ తన గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా సిడ్నీ మైదానంలో గురువారం మధ్యాహ్నం భారత్, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్ 7వ ఓవర్ జరుగుతుండగా.. ఓ భారత అభిమాని తన గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. వెంట తెచ్చుకున్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో మోకాలిపై కూర్చుని అబ్బాయి ప్రపోజ్ చేయగా.. అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయింది. ఆపై నవ్వుతూ అతడి ప్రేమను అంగీకరించింది. దాంతో అమ్మాయిని కౌగిలించుకుని అబ్బాయి తన సంతోషం వ్యక్తం చేశాడు. ఆపై ముద్దుపెట్టి తన ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు. 



స్టాండ్స్​లో అమ్మాయి, అబ్బాయి ప్రేమకు ఫాన్స్ అందరూ ఆశీర్వాదాలు అందించారు. ఈ ఘటనతో స్టాండ్స్​లో కాసేపు సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2022లో ఇలా ప్రపోజల్‌ను చూడడం ఇది మొదటిసారి కాదు. గతంలో పూణెలోని ఎంసీఏ స్టేడియంలో ఒక అమ్మాయి ఆర్సీబీ అభిమానికి ప్రపోజ్ చేసింది. టీమిండియా పేసర్ దీపక్ చహర్ కూడా 2020లో దుబాయ్ స్టేడియంలో తన భార్య జయ భరద్వాజ్‌కి ప్రపోజ్ చేశాడు.


Also Read: Rohith Sharma: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ


Also Read: IND vs NED Live Updates: నెదర్లాండ్స్‌పై భారత్ విజయం.. భారత్ ఖాతాలో 4 పాయింట్స్!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook