Tokyo Olympics 2021: టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టోక్యో ఒలంపిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. గ్రాస్ కోర్టుపై ఆడుతూ మరోసారి మోకాలి గాయం కావడంతో స్విట్జర్లాండ్ ఆటగాడు ఈ నిర్ణయం టోక్యో ఒలంపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రాస్ కోర్ట్ సీజన్‌లో ఆడుతుండగా మరోసారి మోకాలికి గాయమైందని, తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టోక్యో ఒలంపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ (Roger Federer) ప్రకటించాడు. స్విట్జర్లాండ్ తరఫున ప్రాతినిథ్యం వహించిన ప్రతి సందర్భంలో చాలా గర్వంగా భావించేవాడినని, ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నందుకు తాను నిరాశకు గురవుతున్నానని ట్విట్టర్‌లో రోజర్ ఫెడరర్ పేర్కొన్నాడు. స్విట్జర్లాండ్ జట్టుకు అభినందనలు తెలిపాడు. త్వరలోనే మోకాలి గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశాడు.  2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో డబుల్స్ విభాగంలో స్వర్ణాన్ని సాధించాడు. 2012లో లండన్ ఒలంపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.


Also Read: Australia vs West Indies: టీ20ల్లో యూనివర్సల్ బాస్ Chris Gayle అరుదైన ఘనత


వచ్చే నెలలో 40వ వసంతంలోకి అడుగుపెట్టనున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు 2020లో రెండు మోకాలి సర్జరీలు చేయించుకున్నాడు. ఏడాదిపాటు టెన్నిస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నుంచి మూడో రౌండ్ విజయం తరువాత స్వయంగా వైదొలిగాడు. వింబుల్డన్ (Wimbledon 2021) క్వార్టర్ ఫైనల్లో ఓటమి చెంది 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు మరోసారి దూరమయ్యాడు. కెరీర్‌లో అత్యధికంగా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 8 పర్యాయాలు నెగ్గాడు.


Also Read: Sourav Ganguly biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook