Ind vs Aus U19 Semi Final : అండర్-19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. సమిష్టిగా రాణించిన టీమిండియా కుర్రాళ్లు ఆస్ట్రేలియాను చిత్తు చేశారు. 96 పరుగుల తేడాతో కంగారూలను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. అంటిగ్వా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అండర్ 19 జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 291 పరుగులు చేసింది. కెప్టెన్ యశ్ దుల్ 110 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుత వరల్డ్ కప్‌లో యశ్‌ దుల్‌కి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. మరో బ్యాట్స్‌మ్యాన్ షేక్ రషీద్ 94 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. 


ఆస్ట్రేలియా ఏ దశలోనూ టీమిండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. 41. 5 ఓవర్లలో 191 పరుగులకు ఆ జట్టు కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టులో లచ్లన్ షా (51), కోరె మిల్లర్ (38) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. టీమిండియా బౌలర్లలో విక్కీ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవి కుమార్, నిశాంత్ సింధూ చెరో రెండు వికెట్లు తీశారు. 


తాజా విజయంతో టీమిండియా (Team India) మొత్తం 8 సార్లు అండర్ 19 ఫైనల్‌కి చేరినట్లయింది. ఇప్పటివరకూ నాలుగు సార్లు టీమిండియా అండర్ 19 జట్టు ప్రపంచ కప్‌ను ముద్దాడింది. భారత్‌తో ఫైనల్‌లో తలపడనున్న ఇంగ్లాండ్ ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దీంతో ఫైనల్ పోరులో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.


Also Read: Covid 19 Cases Update: నిన్నటి కన్నా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 1.72 లక్షల కేసులు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook