Yash Dhull Record: టీమ్ ఇండియాకు ఆడేందుకు ప్రతిభ కలిగిన కుర్రోళ్లకు కొదవలేదు. రంజీలో కుర్రోళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మొన్న బీహార్ టీమ్ క్రికెటర్ గనీ ట్రిబుల్ సెంచరీ సాధిస్తే..ఇప్పుడు అండర్ 19 కెప్టెన్ యశ్‌ధుల్ చరిత్ర సృష్టించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటి అండర్ 19 ప్రపంచకప్..ఇప్పుడు జరుగుతున్న రంజీ ట్రోఫీలో అంతా యంగ్ క్రికెటర్లదే హవా. అద్భుతాలు సృష్టిస్తున్నారు. అటు బ్యాటింగ్..ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ రికార్డులు నమోదు చేస్తున్నారు. మొన్న బీహార్ రంజీ టీమ్ ఆటగాడు గనీ ట్రిబుల్ సెంచరీతో ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇప్పుడు మరో యంగ్ క్రికెటర్ చరిత్ర సృష్టించాడు.


ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ 2022లో ఇండియాకు టైటిల్ సాధించి పెట్టిన కెప్టెన్ యశ్‌ధుల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీలు నమోదు చేశాడు. ఢిల్లీ-తమిళనాడు జట్ల మద్య జరిగిన తొలి మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసి అరుదైన ఫీట్ సాధించారు యశ్‌ధుల్. 8 ఏళ్ల తరువాత ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గుజరాత్ ఆటగాడు నారీ కాంట్రాక్టర్ తొలి ఆటగాడు కాగా, మహారాష్ట్ర బ్యాట్స్‌మెన్ విరాగ్ అవతే రెండవ ఆటగాడిగా ఈ ఫీట్ సాధించారు. దాదాపు 8 ఏళ్ల తరువాత యశ్‌ధుల్ తిరిగి రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలతో రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీలో ఈ రికార్డు తొలిసారిగా 1952-53లో నమోదైంది. తిరిగి అదే రికార్డు రెండవసారి 2012-13లో నమోదైంది. ఇప్పుడు మూడవ బ్యాట్స్‌మెన్‌గా యశ్‌ధుల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ 113 పరుగుల చొప్పున నమోదు చేశాడు. 


తాజాగా ముగిసిన ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో యశ్‌ధుల్‌ను ఢిల్లీ కేపిటల్స్ జట్టు 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు రంజీలో సాధించిన రికార్డుపై ఢిల్లీ కేపిటల్స్ జట్టు అధికారికంగా యశ్‌ధుల్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడవ ఆటగాడు యశ్‌ధుల్ మాత్రమేనని ట్వీట్ చేసింది.


Also read: Umran Malik: టీమ్ ఇండియాకు ఆడాలనేది ధ్యేయమంటున్న ఉమ్రాన్ మాలిక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook