రిషబ్ పంత్ పట్టించుకోకున్నా.. ఊర్వశి రౌతేలా సీరియస్‌గా ప్రేమిస్తుందా! ఆస్ట్రేలియాలో హాట్ బ్యూటీ
Urvashi Rautela follows Rishabh Pant to Australia. రిషబ్ పంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియాల విమానంలో ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
Urvashi Rautela truly loves Rishabh Pant: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2022కి సమయం ఆసన్నమవుతోంది. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా పొట్టి టోర్నీ ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా జట్లు ఆసీస్ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. ఆస్ట్రేలియా చేరుకున్న భారత్ కూడా అక్కడ సాధన మొదలెట్టింది. అక్టోబరు 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దాయాది పాకిస్తాన్‌తో జరిగే మ్యాచుతో భారత్ టోర్నీని ఆరంబించనుంది.
స్టార్ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనేందుకు టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా చేరుకున్నాడు. పంత్‌కి ఇది మూడో ప్రపంచకప్. 2019లో వన్డే ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న పంత్.. టీ20 ప్రపంచకప్ 2021లో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2022కి ఎంపికయ్యాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇటీవలి కాలంలో పంత్ అంతగా రాణించలేకపోవడంతో.. అందరి దృష్టి అతనిపైనే ఉంది. బాగా రాణిస్తున్న సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకుండా.. పంత్‌ను బీసీసీఐ ఎంచుకోవడంతో అదనపు ఒత్తిడి పడనుంది. అయితే ఫినిషర్ దినేష్ కార్తీక్ జట్టులో ఉండడంతో మనోడికి చోటు దక్కడం కాస్త కష్టమే అని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఈరోజు రిషబ్ పంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియాలో విమానంలో ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'ఆస్ట్రేలియాలో ఉన్నా… సాహసం ప్రారంభమవుతుంది' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టుకు విమానంలో రెడీ అవుతున్న, సినిమా ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ అభిమానులతో ఊర్వశి పంచుకున్నారు. ఊర్వశి పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. దాంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పంత్‌ను ఫాలో అవుతున్న ఊర్వశి, పంత్ పట్టించుకోకున్నా.. ఊర్వశి సీరియస్‌గా ప్రేమిస్తుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: దేవరకొండతో కలిసి మాల్దీవులకు రష్మిక.. 'అవి' పెట్టుకోవడంతో అడ్డంగా బుక్కయ్యారుగా!
Also Read: కొత్త కారుకు గొప్ప వెల్‌కమ్.. ఎంట్రీ అదిరిపోయిందిగా! వీడియో చూస్తే నవ్వుకుంటారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.