USA Vs PAK Highlights: పాక్ ఇజ్జత్‌ను గంగలో కలిపేసిన అమెరికా.. చితక్కొట్టి వదిలేశారయ్యా..!
Who is Saurabh Netravalkar: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను అమెరికా చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్.. చివరకు సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో ఐదు పరుగుల తేడాతో యూఎస్ఏ ఓడించి గ్రాండ్ విక్టరీ అందుకుంది.
Who is Saurabh Netravalkar: టీ20 ప్రపంచ కప్‌లో అమెరికా పెను సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌ను చిత్తు చేసి.. హిస్టరీ క్రియేట్ చేసింది. సూపర్ ఓవర్‌లో గెలుపొంది.. పాకిస్థాన్‌కు ఊహించని షాకిచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం అమెరికా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ ఓవర్‌లో అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ వికెట్ కోల్పోయి కేవలం 13 పరుగులకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Also Read: Heavy rains: తెలుగురాష్ట్రాల్లో కుండపోతే.. రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి అమెరికా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (50 పరుగులు, 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీతో రాణించడంతో లక్ష్యాన్ని సమం చేసింది. ఆండ్రీస్ గౌస్ (35), ఆరోన్ జోన్స్ (26 బంతుల్లో 36 నాటౌట్), నితీష్ కుమార్ (14 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. చివరి ఓవర్‌లో 13 పరుగులు చేసి మ్యాచ్‌ని టై చేశారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆరంభంలోనే యూఎస్‌ఏ బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. 26 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి.. కష్టాల్లో నెట్టారు. షాదాబ్ ఖాన్ (25 బంతుల్లో 40) కాస్త దూకుడుగా ఆడగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ 43 బంతుల్లో 44 పరుగలతో రాణించడంతో పాక్ కోలుకుంది. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది.
సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్ బౌలర్ ఆమిర్ ధారళంగా పరుగులు ఇచ్చేశాడు. ఏకంగా ఏడు వైడ్లు వేసి.. అమెరికా గెలుపునకు పరోక్షంగా సహకారం అందించినట్లయింది. 11 పరుగులు+7 ఎక్స్‌ట్రాలు కలిపి 18 పరుగులు చేసింది. అనంతరం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రవల్కర్ సూపర్ బౌలింగ్‌తో కట్టడి చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన యూఎస్‌ఏ.. మొత్తం 4 పాయింట్లతో గ్రూప్-ఏలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్, ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచినా సూపర్-8కి చేరుకునే అవకాశం ఉంది. ఇక పాకిస్థాన్ పరిస్థితి భిన్నంగా మారిపోయింది. సూపర్-8కి చేరుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.
ఎవరి సౌరభ్ నేత్రవల్కర్..?
పాక్‌ను అమెరికా చిత్తు చేయడంలో ఫాస్ట్ బౌలర్ సౌరబ్ నేత్రవల్కర్ పేరు మార్కోగిపోతుంది. ఈ స్పీడ్ స్టార్ 1991 అక్టోబర్ 16న ముంబైలో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున క్రికెట్ ఆడాడు. 2008-09లో కూచ్ బెహార్ ట్రోఫీలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టి పెనుసంచలనం సృష్టించాడు. అండర్-19 2010 ప్రపంచకప్‌లో కూడా భారత్ తరపున ఆడాడు. ఆ టోర్నీలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ తదితర ప్లేయర్లతో కలిసి ఆడాడు. భారత్ తరఫున అత్యధికంగా 9 వికెట్లు తీశాడు. ఆ తరువాత చదువుపై మరింత దృష్టి పెట్టేందుకు కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లిపోయాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఒరాకిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ.. ఆ దేశం తరుఫున క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఇప్పటివరకు యూఎస్ఏ తరుఫున 48 వన్డేలు ఆడి 73 వికెట్లు పడగొట్టాడు. 28 టీ20 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీశాడు.
Also Read: Allu Arjun: పుష్ప ఫైర్ ఇక తగ్గినట్టేనా.. మొత్తానికి తేలిపోయిన తిక్క
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter