IRE Vs USA: అందుబాటులో లేని అంపైర్లు.. అంతర్జాతీయ వన్డే మ్యాచ్ రద్దు! కారణం ఏంటంటే?
డిసెంబర్ 26న ఐర్లాండ్, యూఎస్‌ఏ జట్ల మధ్య తొలి వన్డే జరగాల్సి ఉంది. తొలి వన్డే నేపథ్యంలో ఈరోజు ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అంపైర్లకు కొరోనా టెస్టులు చేశారు. అంపైర్ బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
USA vs Ireland 1st ODI Match Cancelled After Umpire Tests Covid 19 Positive: కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా ఇటీవలి కాలంలో డొమెస్టిక్, లీగ్ క్రికెట్ మ్యాచులే కాకుండా అంతర్జాతీయ మ్యాచులు కూడా రద్దవడం లేదా వాయిదా పడడం జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. అంపైర్లు అందుబాటులో లేని కారణంతో ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ రద్దు అయింది. అంపైర్ బృందంలోని ఒకరు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడడంతో ఐర్లాండ్, యూఎస్‌ఏ (USA vs Ireland) మధ్య జరగాల్సిన తొలి వన్డే రద్దైయింది. ఈ విషయాన్ని యుఎస్‌ఎ క్రికెట్ (USA Cricket) ఓ ప్రకటనలో తెలిపింది. క్రికెట్ ఐర్లాండ్, ఐసీసీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
డిసెంబర్ 26న ఐర్లాండ్, యూఎస్‌ఏ (USA vs IRE) జట్ల మధ్య తొలి వన్డే జరగాల్సి ఉంది. తొలి వన్డే నేపథ్యంలో ఈరోజు ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అంపైర్ల (Umpires)కు కొరోనా టెస్టులు చేశారు. అంపైర్ బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మిగతా ముగ్గురు అంపైర్లకు మాత్రం నెగటివ్ వచ్చింది. అయితే పాజటివ్ వచ్చిన అంపైర్‌తో మిగతా ముగ్గురికి క్లోజ్ కాంటాక్ట్ ఉన్న నేపథ్యంలో అందరిని ఐసోలేషన్‌లో ఉంచారు. దాంతో ఆదివారం జరగనున్న తొలి వన్డే ((USA vs IRE) 1st IDI)కు అంపైర్లు అందుబాటులో లేకుండా పోయారు. దాంతో ఇరు జట్ల బోర్డుల అంగీకారంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
Also Read: IND vs SA: ఓ నాయకుడిగా విరాట్ కోహ్లీ జట్టులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు: ద్రవిడ్
డిసెంబర్ 28న ఐర్లాండ్, యూఎస్‌ఏ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని యుఎస్‌ఎ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. 30న మూడో వన్డే కూడా యధావిధిగా జరుగనుందట. అంతకముందు ఐర్లాండ్, యూఎస్‌ఏల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ జరిగింది. మొదటి టీ20లో ఆతిథ్య యూఎస్‌ఏ, రెండో టీ20లో ఐర్లాండ్ గెలుపొందడంతో.. పొట్టి సిరీస్ 1-1తో సమం అయింది. ఇక పటిష్ట ఐర్లాండ్ వన్డే సిరీసును చేజిక్కించుకోవాలి చూస్తోంది.
'క్రికెట్ ఐర్లాండ్, ఐసీసీతో కలిసి పని చేయడంను యుఎస్‌ఎ క్రికెట్ కొనసాగిస్తుంది. ఐర్లాండ్, యూఎస్‌ఏ (USA vs IRE) జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే దురదృష్టవశాత్తు ఈ సాయంత్రం రద్దు చేయబడింది. నలుగురు అంపైర్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. మిగతా ముగ్గురు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. దాంతో మొదటి వన్డేకి ఎవరూ అందుబాటులో లేరు. మిగతా రెండు వన్డేలు యధావిధిగా జరుగుతాయి. యూఎస్‌ఏ క్రికెట్‌కి నిరంతరం అండగా నిలుస్తున్న అభిమానులు మరియు మద్దతుదారులందరికీ ధన్యవాదాలు. మొదటి వన్డే టికెట్ కొనుగోలుదారులు మిగతా రెండు వన్డేలలో ఒక దానికి రావొచ్చు. లేదా డబ్బు వాపస్ ఇస్తాం' అని యుఎస్‌ఎ క్రికెట్ (USA Cricket) పేర్కొంది.
Also Read: Thief Fires Bike: చలి మంట కాగేందుకు.. ఏకంగా బైక్‌నే తగలబెట్టిన దొంగ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook