ఫుట్‌బాల్ క్రీడ ఆడనున్న ఉసేన్ బోల్ట్..!
మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడం మాత్రమే కాకుండా పరుగు పందెంలో దాదాపు అన్ని రికార్డులను కూడా తిరగరాసిన మేటి ఆటగాడు ఉసేన్ బోల్ట్ అనడంలో సందేహం లేదు.
మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడం మాత్రమే కాకుండా పరుగు పందెంలో దాదాపు అన్ని రికార్డులను కూడా తిరగరాసిన మేటి ఆటగాడు ఉసేన్ బోల్ట్ అనడంలో సందేహం లేదు. ఈ జమైకన్ ఆటగాడు ఇప్పుడు ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎదగాలని భావిస్తున్నాడట. అందులో భాగంగానే జర్మనీలో టాప్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన బోరుస్యా డార్ట్‌మండ్ జట్టు నిర్వహిస్తున్న సెలక్షన్ టెస్టుకి తాను కూడా హాజరవుతున్నాడు. ఒకవేళ తాను ఎంపికైతే తన సాకర్ కెరీర్ ప్రారంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తన అభిమాన జట్టైన మాంచెస్టర్ యునైటెడ్ తరఫున ఆడాలన్నది తన చిరకాల కల అని బోల్ట్ చెప్పడం గమనార్హం. మరి ప్రపంచంలోనే టాప్ స్ర్పింట్ దిగ్గజమైన బోల్ట్, ఫుట్‌బాల్‌లో ఏమేరకు రాణిస్తాడన్న విషయం మాత్రం వేచి చూడాల్సిందే.