హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA) అధ్యక్షడు వివేక్ కు హైకోర్టులో చుక్కెదురైంది. HCA  అధ్యక్ష పదవి విషయంలో సింగల్ జడ్జీ ఇచ్చిన తీర్పును పునర్విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి  నేతృత్వంలోని ధర్మాసనం  ఆదేశించింది. హైకోర్టు తాజాగా ఆదేశాలతో వివేక్ HCA  పదవి మరోమారు కోల్పోయే అవకాశముందని న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వివేక్ HCA అధ్యక్ష పదవిలో కొనసాగడం జోడు పదవుల కిందకు వస్తుందని..ఇది చట్ట విరుద్ధమని అజారుద్దీన్ అంబుడ్స్ మెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్ మెన్ వివేక్ ఎన్నిక  చెల్లదని తేల్చిచెప్పింది. 


అంబుడ్స్ మెన్ నిర్ణయంతో పదవి కోల్పోయిన వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. వివేక్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ...అంబుడ్స్ మెన్ తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వివేక్‌కు ఊరట కలిగింది.  అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ  అజారుద్దీన్ ధర్మాసనానికి అప్పీల్ చేశారు. దీనిపై ఈ రోజు విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.