Vijay Hazare Trophy: Pacer Sreesanth: టీమిండియా పేసర్‌గా ఓ వెలుగు వెలిగిన కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వివాదంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల నిషేధం గడువు ముగియడంతో మళ్లీ బంతిని అందుకున్న శ్రీశాంత్ నిప్పులు చెరిగాడు. విజయ్ హజారే ట్రోఫీలో తనదైన మార్క్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ బౌలర్ శ్రీశాంత్ 5/65తో 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో ఉత్తరప్రదేశ్ జట్టును దెబ్బతీశాడు. ఫిబ్రవరి 22న గ్రూప్ సిలో భాగంగా యూపీతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరులోని కేఎస్‌సీఏ స్టేడియంలో శ్రీశాంత్ 9.3 ఓవర్లలో 5 వికెట్లు తీసి 65 పరుగులు ఇచ్చాడు. 2006 అనంతరం శ్రీశాంత్(Pacer Sreesanth) అయిదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. శ్రీశాంత్ బౌలింగ్ దెబ్బకు ఉత్తరప్రదేశ్ 49.4 ఓవర్లలో 283 పరుకులకే పరిమితమైంది.


Also Read: IPL 2021 Latest News: కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ 2021 నిర్వహించాలని యోచిస్తున్న BCCI


యూపీ ఓపెనర్ అభిషేక్ గోస్వామి (54; 63 బంతుల్లో, 2x6, 4x4)తో పాటు టాప్ స్కోరర్ అక్షదీప్ నాథ్ (68; 60 బంతుల్లో, 9x4)ను యూపీ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar)ను సైతం పెవిలియన్ బాట పట్టించాడు.  టోర్నమెంట్‌లో కేవలం తాను ఆడుతున్న 2వ మ్యాచ్‌లోనే శ్రీశాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. తిరిగి జాతీయ జట్టులోకి రాణించాలని కలలు కంటున్న శ్రీశాంత్ తన శక్తిమేర డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించాలని భావిస్తున్నాడు.


Also Read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే


ఐపీఎల్ 2021 వేలంలో చోటు దక్కించుకోవాలని చూసిన పేసర్ శ్రీశాంత్‌కు నిరాశే ఎదురైంది. క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు 7ఏళ్లు వేచిచూసిన తనకు మరికొంత కాలం వేచి చూడటం పెద్ద విషయమేమీ కాదని, తనపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే తన పేరును ఐపీఎల్ 2021 వేలంలో చేర్చకపోవడం మాత్రం బాధ కలిగించిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ఓ వీడియో పోస్ట్ సైతం చేశాడు.


Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021లో Sunrisers Hyderabad మొత్తం ఆటగాళ్ల జాబితా ఇదే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook