Mansukh Mandaviya Video: క్రికెట్ ఆడిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో..
Mansukh Mandaviya: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా క్రికెట్ ఆడారు. ఫీల్డింగ్, బౌలింగ్ మరియు బ్యాటింగ్ లో ఇరగదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Mansukh Mandaviya Plays Cricket: ఇటీవల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో నేతలంతా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే వారికి ఖాళీ సమయమే దొరగడం లేదు. అలాంటిది కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా(Mansukh Mandaviya) గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని మల్టీపర్పస్ గ్రౌండ్‌లో స్థానికులతో క్రికెట్(Cricket) ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
51 ఏళ్ల మాండవీయా ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోరుబందర్ నుంచి పోటీ చేయబోతున్నారు. పార్లమెంట్‌కు సైకిల్‌పై వచ్చి గ్రీన్ ఎంపీగా పేరొందారు. తాజాగా బ్లాక్ టీ-షర్టు ధరించిన మంత్రి.. అవుట్‌ఫీల్డ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు. అంతేకాకుండా మాండవీయా అద్భుతంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లోనూ భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మంత్రి ప్రతి ఆటగాడి దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య శాఖతోపాటు కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ మంత్రిగా కూడా ఉన్నారు.
2002లో గుజరాత్‌లో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన మన్సుఖ్ మాండవియా.. 2012లో గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్ మరియు ఫెర్టిలైజర్స్ శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. 2018లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. స్వయంగా వెటర్నరీ డాక్టర్ అయిన మాండవీయాకు కొవిడ్ సంక్షోభ సమయంలో హెల్త్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు.
Also Read: RCB vs KKR Live Score: విరాట్ కోహ్లీ శ్రమ వృథా.. కేకేఆర్ చేతిలో బెంగళూరు బోల్తా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook