Virat Kohli teased bangladesh player Najmul Hossain Shanto in IND vs BAN 2nd Test: టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరుగులు చేయడంలో ముందుండే కోహ్లీ.. దూకుడుగా కూడా ఉంటాడు. తనను మాత్రమే కాదు జట్టులోని ఏ ఆటగాడినైనా ఎవరేమన్నా అస్సలు ఊరుకోడు. ఇక ప్రత్యర్థులను కవ్వించడంలో అందరికంటే ముందుడే కోహ్లీ.. సమయం, సందర్భం దొరికితే ఊరుకుంటాడా?. ప్రత్యర్థి ఆటగాళ్లకు తన మాటలతో చుక్కలు చూపిస్తాడు. తాజాగా ఇలాంటి ఘటనే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢాకాలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆటను (శుక్రవారం) ముగించడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమై 5 ఓవర్లు ముగిసాయి. ఆరో ఓవర్‌లోని చివరి బంతికి ముందు బంగ్లా ఓపెనర్ నజ్ముల్‌ షాంటో షూస్ సాక్స్‌లను సరిచేసుకొనేందుకు బౌలింగ్‌ను ఆపాడు. అప్పటికే వెలుతురు మందగిస్తుండటంతో.. ఇంకొన్ని ఓవర్లు వేయాలనే ఆలోచనలో భారత్ ఉంది. షాంటో కారణంగా కాస్త ఆలస్యం అయింది. దాంతో టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. 


బంగ్లా ఓపెనర్ నజ్ముల్‌ షాంటోపై విరాట్ కోహ్లీ మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్.. ఆ టీ షర్ట్‌ కూడా విప్పేయ్' అని అరుస్తూ సైగలు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు బ్యాట్‌ మార్చుకోవాలంటూ.. డగౌట్ నుంచి వేరే బ్యాట్లు తెప్పించుకుని అన్నీ చెక్‌ చేసి మళ్లీ పాత బ్యాట్‌తోనే బ్యాటింగ్‌కు దిగాడు. ఏ రెండు చర్యలతో కోహ్లీ అసహనానికి గురయ్యాడు. 



రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బంగ్లాదేశ్‌ 227 పరుగులు చేసింది. దీంతో రాహుల్ సేనకు 87 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. ప్రస్తుతం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 231 పరుగులకు ఆలౌట్ అయింది. 145 పరుగుల లక్ష్య చేధనకు భారత్ బరిలోకి దిగింది. 


Also Raed: Cheapest Honda City Cars: రూ. 5.33 లక్షలకే హోండా సిటీ కారు.. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా! 


Also Read: SRH Squad IPL 2023: నలుగురు మంచి ప్లేయర్లను పట్టిన కావ్య పాప.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.