Virat Kohli Hotel Room Video Leaked: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోహ్లి రూమ్‌లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో గురించి తెలుసుకున్న కింగ్ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'తమకు ఇష్టమైన ఆటగాళ్లను చూస్తే అభిమానులు చాలా ఆనందానికి గురవుతారు. వారి ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అయితే ఓ అభిమాని తీసిన వీడియో చాలా ప్రమాదకరమైంది. ఇది నా ప్రైవసీకి సంబంధించి తీయడం నాకు చాలా బాధ కలిగించింది. నాకు హోటల్ రూమ్‌లోనే ప్రైవసీ లేకపోతే.. ఇక నాకు ఎక్కడ ప్రైవసీ ఉంటుంది. దయచేసి అందరీ వ్యక్తిగత ప్రైవసీని గౌరవించండి. మమ్మల్ని వినోద వస్తువులుగా పరిగణించవద్దు. వ్యక్తిగత ప్రైవసీకి ఇబ్బంది కలిగించే ఇలాంటి వీడియోలు తీయవద్దు..' అంటూ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ పోశాడు. 


ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వీడియో తీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రికెటర్లు, బాలీవుడ్ హీరోలు సైతం వీడియోపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు అస్సలు ఊహించలేమని అంటున్నారు. 


 



T20 వరల్డ్ కప్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో పెర్త్‌లో భారత్ తలపడింది. ఈ వీడియో పెర్త్‌లోని హోటల్‌కి సంబంధించినదిగా భావిస్తున్నారు. టీమ్ ఇండియా ఇంతకుముందు మెల్‌బోర్న్, సిడ్నీలలో రెండు మ్యాచ్‌లు ఆడింది. వైరల్ అవుతున్న వీడియోలో కోహ్లి షూస్‌తో పాటు జెర్సీ, వాచ్, క్యాప్, అద్దాలు ఇలా అన్ని వస్తువులు చూపిస్తూ రూమ్ మొత్తం వీడియో తీశారు.


ఇక T20 వరల్డ్ కప్‌ లో కింగ్ కోహ్లి రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. ముఖ్యంగా దయాది పాకిస్థాన్‌పై టీమిండియాకు చిరకాలం గుర్తుండిపోయేలా అద్భుత విజయాన్ని అందించాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అర్ధసెంచరీతో భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారీ షాట్‌కు యత్నించి కోహ్లి ఔటయ్యాడు. 


Also Read: T20 World Cup: డేంజర్‌ జోన్‌లో టీమిండియా.. మారిపోయిన సెమీస్ లెక్కలు


Also Read: India T20 World Cup: టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. చేసిన తప్పులు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook