విరాట్ కోహ్లీనే ఆ రెండు సిక్సర్లు బాదగలడు.. దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉండుంటే..: హరీస్ రవూఫ్
Haris Rauf says Virat Kohli is only batter hits that two incredible sixes. టీ20 ప్రపంచకప్ 2022లో విరాట్ కోహ్లీ తన బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సులు బాదిన విషయంపై తాజాగా హరీస్ రవూఫ్ స్పందించాడు.
Haris Rauf says Virat Kohli is only batter hits that two incredible sixes: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న దాయాదులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చివరి బంతికి పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) అండతో చివరి వరకు క్రీజులో నిలబడి టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించాడు. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆ పోరును కోహ్లీ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు.
లక్ష్య ఛేదనలో 31 పరుగులకే కీలక నాలుగు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. పాక్ పేసర్లు వరుసగా దాడి చేసినా.. తన అనుభవాన్ని ఉపయోగించి క్రీజులో గోడలా నిలబడ్డాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచును తన ఆటతో రేసులోకి తెచ్చాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి రాగా.. ప్రమాదకర బౌలర్‌గా పేరున్న హరీస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్ చివరి 2 బంతులకు అద్భుత సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి రాగా.. అద్భుతం చేసిన విరాట్ మ్యాచ్‌ను గెలిపించాడు.
విరాట్ కోహ్లీ తన బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సులు బాదిన విషయంపై తాజాగా హరీస్ రవూఫ్ స్పందించాడు. కోహ్లీలా మరే ఆటగాడు బ్యాటింగ్ చేయలేడని ప్రశంసించాడు. 'టీ20 ప్రపంచకప్ 2022లో విరాట్ కోహ్లీ ఆడిన విధానం అతడి స్థాయిని తెలియజేస్తుంది. కోహ్లీ ఎలాంటి షాట్లు ఆడగలడో మనందరికీ తెలుసు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో ఎవరున్నా.. నేను విసిరిన బంతులకు అలాంటి షాట్లు ఆడలేకపోయేవారేమో. దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా ఆ రెండు సిక్సులు బాదుంటే నేను చాలా బాధపడేవాడిని. కోహ్లీ కాబట్టి సరిపోయింది. అందరికన్నా అతడు విభిన్నమైన ఆటగాడు' అని రవూఫ్ అన్నాడు.
Also Read: గ్లాస్ వెనకాల అందాలు ఆరబోసిన అదా శర్మ.. హాట్ పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే!
Also Read: Samson vs Pant: అవకాశాల కోసం సంజూ శాంసన్ ఆగాల్సిందే.. శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.