Danish Kaneria on Virat Kohli's Knock vs Pakistan: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విరాట్ సాధారణ ఆటగాడిగా కనిపిస్తున్నాడన్నాడు. కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ గొప్పదేమీ కాదని, అతడు ఇంకా పరుగులు సాధించాల్సి ఉందన్నాడు. నెల రోజులపైగా విరామం అనంతరం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచులో విరాట్ పర్వాలేదనిపించాడు. 34 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 35 రన్స్ చేశాడు. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆతృతగా ఎదురుచూసిన అభిమానుల్లో ఈ ఇన్నింగ్స్‌ కాస్త జోష్‌ నింపిందనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డానిష్ కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్‌ కోహ్లీపైనే ఉంది. కానీ అతను మళ్లీ ఫ్లాప్ అయ్యాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో బంతులను ఎదర్కొవడానికి చాలా కష్టపడ్డాడు. చాలాసార్లు బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుంది. కేఎల్‌ రాహుల్‌ కూడా దురదృష్టవశాత్తూ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తాకి బౌల్డ్ అయ్యాడు. అతడు ఆడిన రెండో డెలివరీలోనే ఔట్ అయ్యాడు. ఫఖర్ జమాన్ క్యాచ్‌ను పట్టుకోలేకపోవడం అతని అదృష్టం. విరాట్ తన ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక మంచి షాట్‌ ఆడాడు. అతడు ఇంకా పరుగులు సాధించాల్సి ఉంది' అని అన్నాడు.  


'విరాట్ కోహ్లీ ఆడింది అంత గొప్ప ఇన్నింగ్స్‌ కాదు. నాకు సాధారణ ఆటగాడిగా కనిపించాడు. కోహ్లీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్సిన్నర్‌కు ఎక్స్‌ట్రా-కవర్‌ దిశగా ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ షాట్‌లు ఆడుతున్నపుడు ఔట్ అవుతున్నానని అతడు తెలుసుకోవాలి. గతంలో దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ ఇదే షాట్‌ ప్రయత్నించి వికెట్‌ కోల్పోయాడు. అందుకే ఆటువంటి షాట్‌ ఆడడం సచిన్ మానేశాడు. ఇప్పుడు కోహ్లీ అదే తప్పు చేస్తున్నాడు' అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. 


Also Read: సిక్సులను సునాయాసంగా కొట్టే హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఇదే!


Also Read: Belly Fat Reduce: ఇంట్లోనే ఈజీగా ఇలా బెల్లీ ఫ్యాట్‌ను 1 వారంలో నియంత్రించవచ్చు..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి