Virat Kohli Names AB de Villiers as Fastest Runner Between Wickets: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధానత్యనిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. కోహ్లీ ప్రతి రోజూ జిమ్‌లో గంటల కొద్ది శ్రమిస్తాడు. కోహ్లీని చూసే ఎందరో భారత ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ ఫిట్‌నెస్‌ కారణంగానే మైదానంలో రికార్డుల రారాజు ఎంతో చురుగ్గా ఉంటాడు. అంతేకాదు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతాడు. సరైన బ్యాటర్ ఉంటే.. సింగిల్ వచ్చే దగ్గర డబుల్ కూడా తీస్తాడు. ఎన్ని సింగిల్స్, డబుల్స్ తీసినా.. కోహ్లీ మాత్రం అస్సలు అలసిపోడు.. రన్స్ చేస్తూనే ఉంటాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత జట్టు, ఐపీఎల్ సందర్భంగా ఎందరో దిగ్గజ బ్యాటర్లతో కలిసి విరాట్ కోహ్లీ కలిసి ఆడాడు. అయితే వేగంగా సింగిల్స్‌ ఎవరు తీస్తారు? అని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌.. కోహ్లీ అడిగాడు. తనతో పాటు వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే బ్యాటర్‌ను ఎంచుకోవచ్చని కోరాడు. ఈ ప్రశ్నకు వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరును కోహ్లీ చెప్పలేదు. ఏబీడీ పేరునే కోహ్లీ ఎంచుకున్నాడు. ఏబీడీ, కోహ్లీ కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. 


ఏబీ డివిలియర్స్‌తో చిట్ చాట్ సందర్భంగా తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... ‘ఈ ప్రశ్న నాకు గతంలో కూడా ఎదురైంది. వికెట్ల మధ్య నాతో కలిసి అత్యంత వేగంగా పరుగెత్తే ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌. వికెట్ల మధ్య ఎంతో సహకారాన్ని అందించే మరో ప్లేయర్ ఎంఎస్ ధోనీ. ఇద్దరు ఎంత వేగంగా పరుగెత్తుతారో నాకు తెలియదు కానీ.. ఏబీడీ, ధోనీతో కలిసి ఆడితే సరదాగా ఉంటుంది. వీరు క్రీజులో ఉన్నపుడు పరుగు కోసం పిలవాల్సిన అవసరమే ఉండదు’ అని అన్నాడు. వికెట్ల మధ్య అత్యంత వేగంగా ఎవరు పరుగెత్తుతారు అని ఏబీడీని కోహ్లీ అడగ్గా.. తన సహచర ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్‌ పేరు చెప్పాడు.


వికెట్ల మధ్య అత్యంత నెమ్మదిగా పరుగెత్తే బ్యాటర్‌ ఎవరు? అని విరాట్ కోహ్లీని ఏబీ డివిలియర్స్‌ అడిగాడు. ఈ ప్రశ్నకు కోహ్లీ మాట్లాడుతూ... 'ఇది వివాదాస్పదమైన ప్రశ్న. అయితే సమాధానం మాత్రం చేతేశ్వర్ పుజారా. 2018లో సెంచూరియన్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో పుజారా రనౌట్‌ అయ్యాడు. అప్పుడు అతడు పరుగెత్తిన విధానం నాకింకా గుర్తుంది' అని నవ్వుతూ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ 75 సెంచరీలతో 25 వేలకు పైగా రన్స్ చేశాడు. 


Also Read: Tata CNG 2023: బైక్ ధరలోనే టాటా సీఎన్‌జీ కారు.. ఏకంగా 26 కిలోమీటర్ల మైలేజ్! స్టైలిష్ లుక్  


Also Read: Shreyas Iyer IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2023 నుంచి భారత స్టార్ ప్లేయర్ ఔట్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.