Virat Kohli praises Rajat Patidar super Innings in IPL 2022 RCB v LSG Eliminator: ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు రజత్ పటీదార్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ముందుడుగు వేయాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీనియర్లు సైతం తడబడిన చోట పటీదార్‌ సూపర్ సెంచరీ (112 నాటౌట్‌; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు)తో ఆకట్టుకున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ.. బౌండరీల వర్షం కురిపించి పరుగుల వరద పారించాడు. పటీదార్‌ దాటికి బెంగళూరు 200లకు పైగా స్కోర్ చేసింది. సూపర్ నాక్ ఆడిన పటీదార్‌పై అందరూ ప్రశంసిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రజత్ పటీదార్‌పై ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను ఇప్పటివరకు ఎన్నో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు చూశానని, వాటన్నిటి కంటే పటీదార్ ఇన్నింగ్స్ అత్యుత్తమం అని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం రజత్ పటీదార్‌ను కోహ్లీ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. 'నేను చాలా సంవత్సరాలుగా ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు చూశాను. ఒత్తిడిలో ఆడిన ఇనింగ్స్ చాలానే ఉన్నాయి. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించగల ఆటగాళ్లను చూశా. అయితే ఈ రోజు రజత్ పటీదార్ ఆడిన ఇన్నింగ్స్ కంటే.. అవేమీ గొప్పగా అనిపించడం లేదు' అని కోహ్లీ అన్నాడు. 


'తీవ్ర ఒత్తిడిలో, ఎలిమినేటర్ వంటి పెద్ద మ్యాచ్‌లో ఓ అనామక క్రికెటర్ సెంచరీ కొట్టడం అంటే మాములు విషయం కాదు. నేను కూడా ఈ మ్యాచ్‌లో చాలా ఒత్తిడికి గురయ్యా. కానీ రజత్ పటీదార్ మాత్రం బాగా ఆడాడు. తీవ్ర ఒత్తిడిలో అతడు ఆడిన ఇన్నింగ్స్.. నా కెరీర్‌లోనే నేను చూసిన అత్యుత్తమైనది. పటీదార్ ఇన్నింగ్స్ యొక్క గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అలాంటి ఇన్నింగ్స్‌ను దగ్గరుండి చూసినందుకు ఒక క్రికెటర్‌గా నేను సంతోషిస్తున్నా' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 


ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది. రజత్‌ పాటీదార్‌ సెంచరీ చేయగా.. దినేశ్‌ కార్తీక్‌ (37 నాటౌట్‌; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. లక్నో బౌలర్లు మోసిన్‌ఖాన్‌, కృనాల్‌ పాండ్యా, అవేశ్‌ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్ తీశారు. 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లక్నో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్‌ (79), దీపక్‌ హుడా (45) రాణించారు. జోష్ హాజిల్‌వుడ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. 


Also Read: KGF Chapter 2 Collections: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ దండయాత్ర.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఎంతో తెలుసా?


Also Read: Rahu Dosh: రాహు దోషం ఉంటే నిత్యం ఇంట్లో గొడవలే? ఈ పరిహారాలు చేయండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి