Virat Kohli reacts after Vamika's Pictures Goes Viral: ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కూతురు వామికా కెమెరాకి చిక్కిన సంగతి తెలిసిందే. కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ చేతుల్లో కేరింతలు కొడుతున్న వామికా.. స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దాంతో అందరూ మొదటిసారి వామికను చూసి సంబరపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వామిక పుట్టి ఏడాది దాటినా ఇప్పటిదాకా తన ఫొటోలు, వీడియోలు ఏవీ విరుష్క సోషల్ మీడియాలో పంచుకోలేదు. తమ కూతురు విషయంలో ఎంతో జాగ్రత్తపడ్డారు. తమ కూతురి ఫొటోలు, వీడియోలు తీయొద్దని కోహ్లీ-అనుష్క ఇద్దరు అందరినీ కోరిన సంగతి తెలిసిందే.  మూడో వన్డేలో కోహ్లీ అర్ధ శతకం సాధించినపుడు వామికకు అతణ్ని చూపిస్తూ అనుష్క చప్పట్లు కొట్టడం వీడియోలో కనిపించింది. దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ సూపర్ స్పోర్ట్స్ వామిక ముఖాన్ని స్పష్టంగా చూపించింది. దాంతో అభిమానులు దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్‌పై మండిపడ్డారు. 


Also Read: Akhtar - Kohli: నేను కోహ్లీ ప్లేస్‌లో ఉంటే.. అప్పటివరకు పెళ్లి కూడా చేసుకునేవాడిని కాదు! అక్తర్ సంచలన వ్యాఖ్యలు!


ఈ విషయంపై విరాట్‌ కోహ్లీ తాజాగా స్పందించాడు. వామిక ఫొటోలు బయటకు వచ్చిన విషయం తమకు తెలియదని, వాటిని షేర్‌ చేయవద్దని మరోసారి అందరికి విజ్ఞప్తి చేశాడు. 'హాయ్ గైస్. నిన్న స్టేడియంలో వామిక చిత్రాలు క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలోచేశారు. ఈ విషయం మాకు తెలిసింది. నిజానికి కెమెరా మాపై ఉందని తెలియదు. గతంలో ఓసారి చెప్పను.. ఇప్పుడు మరోసారి చెపుతున్నా. దయచేసి వామిక ఫొటోలు తీయొద్దు. ఒకవేళ వామిక ఫొటోలు షేర్‌ చేయని అందరికీ కృతజ్ఞతలు. వారిని మేము అభినందిస్తున్నాం' అని అనుష్కతో కలిసి విరాట్ పేర్కొన్నాడు. 


Also Read: Car U-Turn Viral Video: ఆ డ్రైవర్ మగాడ్రా బుజ్జా! కొండ అంచున కారు యూటర్న్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి