ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో విజయాన్ని సాధించి ఊపుమీదున్న భారత జట్టు.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు సిద్ధమైంది. కివీస్ తో భారత్ మొత్తం మూడు వన్డేలు ఆడనుంది. అక్టోబర్ 22, అక్టోబర్ 25 మరియు అక్టోబర్ 29 తేదీలలో వన్డే సిరీస్ ఆడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరగనున్న మొదటి వన్డే సిరీస్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారత స్టార్ ఆటగాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీకిది 200 వ వన్డే మ్యాచ్. కోహ్లీ చెలరేగి ఆడి ఆరు సిక్సర్లు కొడితే వంద సిక్సర్లు కొట్టిన ఎనిమిదవ భారత క్రికెటర్ గా  రికార్డుల్లోకి ఎక్కుతాడు. అలాగే కివీస్ టీంను ఓడిస్తే టీమిండియాకు ఇది 50వ గెలుపు అవుతుంది.  ఇప్పటికే 146 సిక్సర్లు  కొట్టిన రోహిత్ శర్మ మరో నాలుగు సిక్సర్లు బాదితే 150 సిక్సర్లు అవుతాయి.  నేడు మధ్యాహ్నం గం.1:30ని. లకు ఇరుజట్ల మధ్య తొలి వన్డే ఆరంభం కానుంది. 


కోహ్లీ జైత్ర యాత్ర 


* ఇప్పటివరకు ఆడిన ఓడిఐలు   - 199


* పరుగులు - 8, 767 


* సెంచరీలు - 30


* అర్ధ సెంచరీలు - 45


* అత్యుత్తమ స్కోర్ - 183


* బ్యాటింగ్ సగటు - 55.13 


* స్ట్రైక్ రేట్ - 91. 47 


* సిక్సులు - 818


* ఫోర్లు - 94