T20 rankings: టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC.. దిగజారిన కోహ్లీ, రాహుల్ ర్యాంకులు!
T20 rankings: టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ చేతిలోతో భారత్ ఓడిపోవడంతో.. ఆ ప్రభావం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ పై కూడా పడింది. భారత ఆటగాళ్లు ర్యాంకులు దిగువకు పడిపోయాయి.
ICC T20 rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ తాజాగా ప్రకటించింది. టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) స్థానాలు పడిపోయాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన విరాట్ కోహ్లీ (725) ఐదో స్థానానికి చేరగా.. తొలి మ్యాచ్‌లో విఫలమైన కేఎల్ రాహుల్ (684) ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.
బ్యాటర్ల టాప్ 10 (Top 10) జాబితా పరిశీలిస్తే..ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ (Dawid Malan) 831 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో ఉండగా...పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam)(820) రెండో స్థానానికి ఎగబాకాడు. మూడో స్థానాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్‌క్రమ్ (743) ఆక్రమించాడు. పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (727) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో కోహ్లీ, ఆరో స్థానంలో ఫించ్ (720), ఏడో స్థానంలో డేవిడ్ కాన్వే (714), ఎనిమిదిలో కేఎల్ రాహుల్, తొమ్మిదిలో ఎవిన్ లూయిస్ (679), పదో స్థానంలో హజ్రతుల్లా (671) ఉన్నారు.
Also read: T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ?? ముందున్న సవాళ్లు..!!
ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ (295) తొలిస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ (275) ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రైజ్ షంసి (750) మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక ప్లేయర్ వహిందు డిసిల్వా (726), రషీద్ ఖాన్ (720) ఉన్నారు. అయితే ఆల్‌రౌండర్లు, బౌలర్ల జాబితాలో ఒక్కరంటే ఒక్క భారతీయ క్రికెటర్ కూడా చోటు సంపాదించలేకపోవడం గమనార్హం. జట్లపరంగా చూస్తే.. తొలి మూడు స్థానాల్లో ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్ ఉండగా.. న్యూజిలాండ్ (4), దక్షిణాఫ్రికా (5), ఆస్ట్రేలియా (6), అఫ్గానిస్థాన్ (7), బంగ్లాదేశ్ (8), శ్రీలంక (9), వెస్టిండీస్ (10) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook