Here is Virat Kohli's List of Test Records: టీమిండియా స్టార్ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) శనివారం (జనవరి 15) సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీ (Virat Kohli Test Captaincy)కి విరాట్ గుడ్‌ బై చెప్పేశాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ వైదొలిగాడు. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం స్వయంగా టీ20 కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీని వన్డే నాయకత్వం నుంచి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) తొలగించిన విషయం తెలిసిందే. కోహ్లీ మూడు నెలల్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకడం పెద్ద సంచలంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గాయపడటంతో తొలిసారిగా సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. ఆపై పూర్తిస్థాయి సారథిగా ఎన్నికయ్యాడు. అప్పటినుంచి మహీ సారథ్యంలో మెళకువలు నేర్చుకున్న కోహ్లీ.. అనతి కాలంలోనే మంచి కెప్టెన్‌గా మారాడు. జట్టుకు దూకుడు నేర్పించాడు. ఇక విదేశాల్లో టెస్టు సిరీస్‌లను అందించిన కోహ్లీ.. తన చివరి సారథ్య బాధ్యతలకూ వీడ్కోలు పలికేశాడు. ఆటలోనూ, కెప్టెన్సీలోనూ దూకుడుగా ఉండే కోహ్లీ.. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం. 


Also Read: Archana Gautam: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి


టెస్ట్ రికార్డులు (Virat Kohli Test Records) ఇవే:
# భారత టెస్టు జట్టు సారథిగా విరాట్ కోహ్లీ 68 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించగా.. 40 విజయాలు అందించాడు. 17 టెస్టుల్లో ఓడి మరో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.


# 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో కేవలం ముగ్గురు మాత్రమే కోహ్లీ కంటే కెప్టెన్‌గా అధిక విజయాలను నమోదు చేశారు. గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) 109 మ్యాచుల్లో 53 విజయాలు. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 77 మ్యాచుల్లో 48 విజయాలు. స్టీవ్‌ వా (ఆస్ట్రేలియా) 57 మ్యాచుల్లో 41 విజయాలు.


# తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆసీస్‌ గడ్డ మీదనే కోహ్లీ సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు.


# ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు విదేశీ మైదానాల్లో టెస్టు విజయాలను నమోదు చేసిన అరుదైన ఘనతను కోహ్లీ రెండు సార్లు అందుకున్నాడు. గతేడాది బ్రిస్బేన్, లార్డ్స్‌, ఓవల్‌, సెంచూరియన్‌ స్టేడియాల్లో విజయం సాధించగా.. 2018లో జోహెన్నెస్‌బర్గ్‌, నాటింగ్‌హామ్‌, అడిలైడ్, మెల్‌బోర్న్‌ మైదానాల్లో భారత్ గెలిచింది.


# దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా (SENA ) జట్ల మీద ఎక్కువ విజయాలను నమోదు చేసిన ఆసియా ఖండానికి చెందిన సారథి కూడా కోహ్లీనే. 23 మ్యాచుల్లో 7 విజయాలను నమోదు చేయగా.. 13 పరాజయాలు, మూడు డ్రాగా ముగిశాయి.


# దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌ మైదానంలో (2021-22) విజయం సాధించిన ఏకైక ఆసియా సారథి విరాట్ కోహ్లీ. అంతర్జాతీయంగా మూడో కెప్టెన్‌. 


# దాదాపు 42 నెలల పాటు విరాట్ నాయకత్వంలోని భారత టెస్టు జట్టు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగింది. అక్టోబర్‌ 2016 నుంచి మార్చి 2020 వరకు భారత్‌దే నంబర్‌ వన్‌ ర్యాంక్‌. 


# విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. 


# స్వదేశంలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్‌గానూ విరాట్ రికార్డు సృష్టించాడు. భారత దేశంలో 24 టెస్టుల్లో, విదేశాల్లో 16 టెస్టు విజయాలు సాధించాడు. 


# టెస్టుల్లో కెప్టెన్‌గా ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోని తొలి ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌ కోహ్లీనే.


 


Also Read: UP Polls 2022: ఎన్నికల వేళ ఎస్పీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ములాయం కోడలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook