Virat Kohli Records: ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. క్రికెట్ చరిత్రలోనే `ఒకే ఒక్కడు`!
Virat Kohli wins 10 plus Man Of The Match awards in All Formats. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
Virat Kohli wins 10 plus Man Of The Match awards in All Formats: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఫలితం రాదని స్పష్టం అవడంతో డ్రాకు ఇరు జట్ల సారథులు అంగకరించారు. బౌలర్లకు ఏమాత్రం సహకరించిన పిచ్‌పై ఇటు జట్ల బ్యాటర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 571 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కీలక సమయంలో జట్టును ఆదుకుని భారీ (186) శతకం చేశాడు. దాంతో మూడేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అతనికిది 28వ సెంచరీ. కెరీర్‌లో కోహ్లీ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 75 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీతో కోహ్లీ ఖాతాలో రెండు రికార్డులు చేరాయి. భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ.. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో సమంగా నిలిచాడు. కోహ్లీ, కుంబ్లే ఖాతాలలో 10 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ ఇంకో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన ఆటగాడిగా కోహ్లీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఈ రికార్డు మరెవరి ఖాతాలో లేదు. ఈ జాబితాలో పెద్ద బ్యాట్స్‌మెన్ కూడా ఎవరూ లేరు. టెస్ట్ క్రికెట్‌లో 10 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ అందుకున్న కోహ్లీ.. వన్డే క్రికెట్‌లో 38 సార్లు అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 15 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డ్స్ అందుకున్నాడు.
ఇక ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది వరుసగా నాలుగో టెస్ట్ సిరీస్ విజయం. అన్నింటినీ 2-1తో గెలిచింది. సొంతగడ్డపై భారత జట్టుకు ఇది వరుసగా 16వ టెస్టు సిరీస్ విజయం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి భారత్ చేరిన విషయం తెలిసిందే. టీమిండియాకు ఇది వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్. భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 జూన్ 7న లండన్‌లో ఆరంభమవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.