వన్డేల్లో పాంటింగ్ 30 సెంచరీలు చేయగా... న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 31వ సెంచరీని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ  తొలి మ్యాచ్ లోనే కోహ్లీ అంటే ఏమిటో గుర్తించానని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కోహ్లీలో ఉన్న దూకుడు ఏమాత్రం తగ్గలేదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దూకుడు వైఖరి వల్లే కోహ్లీ   చాలా తక్కువ వ్యవధిలో ఇన్ని సెంచరీలు చేయగల్గాడని సచిన్ ప్రశంసించాడు. కోహ్లీ దూకుడే టీమిండియాకు బలంగా మారిందని కితాబిచ్చాడు.  వాస్తవానికి దూకుడుగా ఉండేవారు అదే స్థాయిలో విమర్శలను కూడా మూటగట్టుకుంటుంటారని... కోహ్లీ విషయంలో కూడా అదే జరుగుతోందని సచిన్ వ్యాఖ్యనించడం గమనార్హం. కుంబ్లే బర్త్ డే రోజు కోహ్లీ విష్ చేయకుండా కామ్ గా ఉన్న విషయం తెలిసిందే ఈ సందర్భంలో సచిన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.