VVS Laxman: డిసెంబర్ 13న ఎన్‌సీఏ బాధ్యతలు చేపట్టనున్న హైదరాబాద్ ప్లేయర్!!
ఎన్‌సీఏ హెడ్ కోచ్ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక లాంఛనంగానే కనిపిస్తోంది. డిసెంబర్ 13న లక్ష్మణ్ ఎన్‌సీఏ బాధ్యతలు చేపట్టనున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన ఓ అధికారి ఓ క్రీడా సంస్థకు చెప్పినట్టు తెలుస్తోంది.
Former Indian player VVS Laxman will join NCA on December 13 as head coach: బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ కోచ్ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఎంపిక లాంఛనంగానే కనిపిస్తోంది. డిసెంబర్ 13న లక్ష్మణ్ ఎన్‌సీఏ బాధ్యతలు చేపట్టనున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి చెందిన ఓ అధికారి ఓ క్రీడా సంస్థకు చెప్పినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు ఎన్‌సీఏ హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. న్యూజీలాండ్ సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. దాంతో రాహుల్ స్థానంలో ఎన్‌సీఏ బాధ్యతలను లక్ష్మణ్ అందుకోనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్.. భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) టెస్ట్ సిరీస్ కోసం వ్యాఖ్యాన ప్యానెల్‌లో భాగంగా ఉన్నారు. రెండో టెస్ట్ మ్యాచుతో అతడి కాంట్రాక్టు ముగియనుంది. ఆపై డిసెంబర్ 13న ఎన్‌సీఏ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. 'వీవీఎస్ లక్ష్మణ్‌తో ఒప్పందం ఇప్పటికే కుదిరింది. న్యూజిలాండ్ మరియు భారత్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచుతో వ్యాఖ్యాతగా అతడి కాంట్రాక్టు ముగుస్తుంది. డిసెంబర్ 13న ఎన్‌సీఏలో చేరనున్నారు. త్వరలోనే అండర్ 19 ఐసీసీ ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ వెళతారు' అని బీసీసీఐ సీనియర్ ఆఫీస్ బేరర్ వార్తా సంస్థపీటీఐకి తెలిపారు.
Also Read: Sara Tendulkar: రొమాంటిక్ డేట్‌కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఇంతకు ఆమె చేయి పట్టుకుంది ఎవరు?
ఎన్‌సీఏలోని అన్ని కోచ్ పదవులను త్వరలోనే ఫిల్ చేస్తామని బీసీసీఐ (BCCI) సీనియర్ ఆఫీస్ బేరర్ పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సదరు అధికారి పాల్గొన్నట్టు సమాచారం. ఇక ఎన్‌సీఏ పేస్ బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ మాజీ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman).. ఎన్‌సీఏ కోచ్ పదవి చేపట్టనున్న నేపథ్యంలో ఆ పదవిని వదిలేశారు.
ఎన్‌సీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మకాం మార్చాల్సి రావడంతో మొదట్లో వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఆ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), సెక్రెటరీ జై షా.. అతడితో సుదీర్ఘ చర్చలు జరిపారు. చివరకు దాదా కోరిక మేరకు ఎన్‌సీ కోచ్ (NCA Coach) పదవిని చేపట్టేందుకు హైదరాబాద్ సొగసరి అంగీకరించారు. నిబంధనల ప్రకారమే కోచ్‌ను నియమిస్తామని తాజాగా బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. లక్ష్మణ్ భారత్ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడారు.
Also Read: Omicron: ఢిల్లీలో ఫస్ట్ ఒమిక్రాన్ కేసు-దేశంలో ఐదుకి చేరిన కొత్త వేరియంట్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook