Wasim Jaffer predicted India playing 11 vs Pakistan Asia Cup 2022 clash: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌, పాకిస్థాన్‌ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆసియా కప్‌ 2022లో భాగంగా మరో కొన్ని గంటల్లో దాయాది దేశాలు తలపడనున్నాయి. దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇండో-పాక్ జట్లు ఆదివారం ఢీ కోటనున్నాయి. చివరిసారిగా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడిన టీ20 ప్రపంచకప్ 2021లో పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు అదే జోరును కొనసాగించి మరోసారి టీమిండియాను ఓడించాలని పాక్ చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టును టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వసీం జాఫర్ ట్విటర్ వేదికగా తన భారత తుది జట్టును ప్రకటించాడు. దాదాపు అందరూ ఊహించే ఆటగాళ్లనే ఎంచుకున్న జాఫర్.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు చోటివ్వలేదు. వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్‌కు బదులుగా దినేష్ కార్తీక్‌ను తీసుకోవాలని సూచించారు. అలానే రెండో స్పిన్నర్‌గా వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు చోటిచ్చారు. జాఫర్ తన జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్‌లు, ఇద్దరు పేసర్‌లకు అవకాశం ఇచ్చారు. 


కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను వసీం జాఫర్ తన జట్టుకు ఓపెనర్లుగా ఎంచుకున్నారు. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యాలకు అవకాశం ఇచ్చారు.  ఆరో స్థానంలో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి చోటు ఇచ్చారు. కార్తీక్‌ను తీసుకోవాలని ఆయన సూచించారు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదవ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌లను ఎంచుకున్నారు. రెండో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌.. మూడో పేసర్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు తీసుకుంటారని జాఫర్ పేర్కొన్నారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్‌లకు చోటిచ్చారు. 



వసీం జాఫర్ తుది జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్/రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చహల్, అర్షదీప్ సింగ్. 


Also Read: Neha Shetty Pics: రాధికతో అట్లుంటది మరి.. బైక్ ఎక్కి మరీ నేహా శెట్టి హాట్ పోజులు!


Also Read: Amala Paul Hot Pics: అమలా పాల్ 'అందాల' అరాచకం.. ఇలా ఎప్పుడూ చూసుండరు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి