Womens BigBash League: పురుషులు, మహిళల క్రికెట్‌లో ఈ మధ్య ఎన్నో థ్రిల్లింగ్ క్యాచులను చూస్తున్నాం. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి సోషల్ మీడియో(Social Media)లో ట్రెండ్ అవుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌(Womens BigBash League)లో ఓ ఫీల్డర్ పట్టిన ఓ క్యాచ్ నెటిజన్స్ మన్ననలు పొందుతుంది. బ్యాట్స్‌ ఉమెన్ కొట్టిన బంతిని ఓ ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ (boundary ropes) దగ్గర గాల్లోకి ఎగిరి కాలి మునివేళ్లతో నిలుచుని అద్భుతంగా క్యాచ్(Amazing Catch)పట్టింది. ఈ క్రమంలో పట్టు తప్పినా.. క్యాచ్ పట్టిన బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటి, మరలా మైదానంలోకి చేరుకుని ఆ బంతిని పట్టుకుంది. ఈ వైరల్‌ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్‌(Australia Cricket) వెబ్‌సైట్‌ సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఆమెను అంతా మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.



Also Read: T20 World Cup 2021: క్రికెట్‌ అభిమానులకు పండగే.. ఇక నుంచి మల్టీప్లెక్స్‌లలో టీ20 సందడి..!


శనివారం బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌(Sydney Thunders), అడిలైడ్‌ స్ట్రైకర్స్‌(Adelaide Strikers) తలపడ్డాయి. ఛేదనలో సిడ్నీ థండర్స్ టీం 19వ ఓవర్‌లో ఇసాబెల్లె వాంగ్‌ (6) బ్యాటింగ్‌ చేస్తుంది. ఈ ఓవర్లో నాలుగో బంతిని డీప్‌మిడ్‌వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌‌గా మలిచేందుకు ట్రై చేసింది. గాల్లోకి లేచిన బంతిని అడిలైడ్‌ ఫీల్డర్‌ బ్రిడ్జెట్‌ పాటర్సన్‌(Bridget Patterson) అందర్నీ అశ్చర్యపరుస్తూ క్యాచ్ పట్టింది. ఈ మ్యాచ్‌లో అడిలైడ్‌ టీం 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి