CSK-Suresh Raina : ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం 2022లో (IPL Auction 2022) పెద్దగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఆటగాళ్లలో సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) ఒకరు. దశాబ్దం పాటు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కు ప్రాతినిధ్యం వహించాడు సురేశ్ రైనా. ఫ్రాంచైజీతో విభేదాల కారణంగా ఈ ఏడాది అతడిని రిటైన్ చేసుకోలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ. 2కోట్లు బేస్ ధరతో వేలంలోకి వచ్చినప్పటికీ అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే రైనాకు భావోద్వేగంతో వీడ్కోలు పలికింది సీఎస్కే. ఈ మేరకు అతడితో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2008లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి రైనా యెుక్క చిరస్మరణీయ క్షణాలను క్యాప్చర్ చేసిన వీడియో మాంటేజ్ ను పోస్ట్ చేసింది. 



'చిన్న తలా'గా పిలువబడే సురేశ్ రైనా ఐపీఎల్ (IPL) లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడు.  ఐపీఎల్​లో మొత్తం 205 మ్యాచ్​ల్లో 32.51 సగటుతో 5528 పరుగులు పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 39 అర్థ సెంచరీలు ఉన్నాయి. చెన్నై జట్టు తరపున 176 మ్యాచ్​లు ఆడిన సురేశ్​ రైనా.. 32.32 సగటుతో 4687 స్కోరు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 


ప్లేఆఫ్‌లలో అత్యధిక ఫోర్లు (51), అత్యధిక సిక్సర్లు (40) కొట్టిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్స్ రైనా. ఇప్పటి వరకు క్వాలిఫైయర్, ఎలిమినేటర్, ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన ఏకైక ఆటగాడు రైనా.  2016, 2017 సీజన్ల తప్ప మిగిలిన అన్ని సీజన్లలోనూ సీఎస్​కేకు రైనా ప్రాతినిధ్యం వహించాడు. 


Also Read; Robin Uthappa : ఐపీఎల్ వేలంపై ఉతప్ప షాకింగ్ కామెంట్స్...ఆటగాళ్లను సంతలో పశువుల్లా కొంటున్నారు అంటూ ఆవేదన..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook