ODI World Cup 2023: స్పేస్ లో వరల్డ్ కప్ ట్రోఫీని లాంఛ్ చేసిన ఐసీసీ, వీడియో వైరల్
ICC Men`s World Cup 2023: ఈ సంవత్సరం ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా జరగనుంది. ఈ ప్రపంచ కప్ కు సంబంధించి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజేతకు ఇచ్చే ట్రోఫీని ఏకంగా స్పేష్ లో లాంఛ్ చేసి ఆశ్చర్యపరిచారు నిర్వహాకులు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
ODI World Cup Trophy out of the World: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 టూర్ సరికొత్త రీతిలో ప్రారంభించబడింది. ఈ వరల్డ్ కప్ ట్రోఫీని ఎవరూ ఊహించని విధంగా స్పేస్ లో లాంఛ్ చేసి ఆశ్చర్యపరిచారు నిర్వహకులు. ఈ ట్రోఫీని భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్‌లోకి పంపినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ ట్రోఫీని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండ్ చేశారు. ఈ సారి మెన్స్ వరల్డ్ కప్ కు ఇండియా అతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో తాజాగా లాంఛ్ చేసిన ట్రోఫీ జూన్ 27 నుంచి 100 రోజులపాటు 18 దేశాలకు వెళ్లనుంది. ఈ ట్రోఫీని అంతరిక్షంలో లాంఛ్ చేసిన వీడియోను ఐసీసీ పోస్టు చేసింది. దీనికి సంంబంధించిన ఫోటోలు, వీడియోలను 4కే కెమెరాలతో షూట్ చేశారు.
జూన్ 27 నుండి భారత్ లో ప్రారంభమయ్యే ట్రోఫీ టూర్.. కువైట్, బహ్రెయిన్, మలేషియా, యుఎస్ఎ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యూఎస్ఏ సహా 18 దేశాలకు వెళ్లనుంది. తిరిగి సెప్టెంబరు 04న భారత్ చేరుకుంటుంది. దాదాపు 10 లక్షల మంది ఈ ట్రోఫీని నేరుగా చూసే అవకాశం కల్పించనున్నారు నిర్వహకులు. "2023 ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది ఇప్పటివరకు జరిగని అతిపెద్ద ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్. ఈ టూర్ ఐకానిక్‌ను నిలుస్తుంది'' అంటూ ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ పేర్కొన్నారు.
Also Read: World Cup 2023 Schedule: వరల్డ్ ఫైనల్, సెమీ ఫైనల్స్ వేదికలు ఫిక్స్..! ఎక్కడంటే..?
ట్రోఫీ టూర్ పూర్తి షెడ్యూల్:
27 జూన్ - 14 జూలై: భారతదేశం
15 - 16 జూలై: న్యూజిలాండ్
17 - 18 జూలై: ఆస్ట్రేలియా
19 - 21 జూలై: పాపువా న్యూ గినియా
22 - 24 జూలై: భారతదేశం
25 - 27 జూలై: యూఎస్ఏ
28 - 30 జూలై: వెస్టిండీస్
31 జూలై - 4 ఆగస్టు: పాకిస్తాన్
5 - 6 ఆగస్టు: శ్రీలంక
7 - 9 ఆగస్టు: బంగ్లాదేశ్
10 - 11 ఆగస్టు: కువైట్
12 - 13 ఆగస్టు: బహ్రెయిన్
14 - 15 ఆగస్టు: భారతదేశం
16 - 18 ఆగస్టు: ఇటలీ
19 - 20 ఆగస్టు: ఫ్రాన్స్
21 - 24 ఆగస్టు: ఇంగ్లాండ్
25 - 26 ఆగస్టు: మలేషియా
27 - 28 ఆగస్టు: ఉగాండా
29 - 30 ఆగస్టు: నైజీరియా
31 ఆగస్టు - 3 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా
సెప్టెంబర్ 4 నుండి: భారతదేశం
Also Read: Wanindu Hasaranga: హసరంగా సంచలన బౌలింగ్.. తొలి స్పిన్నర్‌గా రికార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook