గ్రూప్-డిలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. నైజీరియాతో జరిగిన  మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో గెలవడంతో అర్జంటీనా నాకౌట్‌కు చేరింది. లియోనల్‌ మెస్సీ అద్బుత గోల్‌తో ఖాతా తెరిచిన అర్జెంటీనా నైజీరియాపై ఆధిక్యం కనబర్చింది. సహచర ఆటగాడి నుంచి లభించిన పాస్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్కోస్‌ రోజో అనూహ్యంగా బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాకు విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో మెస్సీ మీద ఆధారపడకుండా అర్జెంటీనా ఆటగాళ్లు అద్బుత ప్రదర్శన కనబర్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



అటు ఐస్‌లాండ్‌పై మాజీ విశ్వవిజేత క్రొయేషియా గెలవడంతో ఆ జట్టు పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానం పొందడమే కాకుండా మెస్సీ బృందానికి కూడా ఊరటనిచ్చింది. దీంతో  క్రొయేషియా(9 పాయింట్లు), అర్జంటీనా(4 పాయింట్లు) పాయింట్లతో నాకౌట్ బెర్తులు పొందాయి. ఐస్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ‘డ్రా’తో గట్టెక్కిన క్రొయేషియాతో రెండో మ్యాచ్‌లో మాత్రం ఖాతా కూడా తెరవకుండా పరాజయం పాలైన విషయం తెలిసిందే. అటు గ్రూప్‌-ఎలో ఉరుగ్వే (9 పాయింట్లు), రష్యా (6 పాయింట్లు)లు, గ్రూప్‌-బిలో స్పెయిన్ (5 పాయింట్లు)‌, పోర్చుగల్‌ (5 పాయింట్లు) జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి.