Rohit Sharma: ఆకాశ్ అంబానీ కారులో రోహిత్ ఏం చేస్తున్నాడు.. వైరల్ అవుతున్న వీడియో..
Rohit Sharma: ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను తన కారులో రైడ్‌కు తీసుకెళ్లాడు ఆ జట్టు సహ యజమాని ఆకాశ్ అంబానీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వీరిద్దరూ కారులో ఎందుకు వెళ్లారో తెలుసా?
Rohit Sharma And Akash Ambani video viral: ఇవాళ వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, ఆర్సీబీల మధ్య కీలక ఫైట్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సహ-యజమాని ఆకాష్ అంబానీ తన కారులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను రైడ్‌కు తీసుకెళ్లారు. ఆకాష్ తన లగ్జరీ కారులో రోహిత్ ను ఎక్కించుకు వెళ్తతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోహిత్ ప్యాసింజర్ సీటులో కూర్చుని ఉండగా.. ఆకాష్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. తన సారథ్యంలో ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ ను ఈ సారి కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పించి హార్దిక్ కు అప్పగించింది జట్టు మేనేజ్మెంట్.
అయితే హార్దిక్ ముంబై పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నెట్టింట రగడ మెుదలైంది. రోహిత్, పాండ్యా ఫ్యాన్స్ ఏకంగా కొట్టుకున్నారు కూడా. ముంబై వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోవడంతో హార్దిక్ కెప్టెన్సీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక దశలో అతడిని కెప్టెన్ గా తప్పించి రోహిత్ కు జట్టుపగ్గాలు అప్పగిస్తారనే విధంగా నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. అయితే ముంబై యాజమాన్యం హార్దిక్ పై నమ్మకం ఉంచింది. అయితే ఇటీవల ముంబై తొలి గెలుపును అందుకుంది. ఇవాళ మరో మ్యాచ్ కు రెడీ అయింది. అయితే తాజాగా ఆకాష్ అంబానీ, రోహిత్ శర్మ కారులో ఎందుకు వెళ్లారు, వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనే విషయాలు బయటకు రాలేదు. అయితే ఈ ఐపీఎల్ రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడిందలేదు. నాలుగు మ్యాచుల్లో అతడు కేవలం 118 పరుగులు చేశాడు. మరి ఈరోజు ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్ లోనైనా తన బ్యాట్ కు పనిచెప్తాడో లేదో చూడాలి.
ఇరు జట్ల డ్రీమ్ 11 ఇదే:
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, సౌరవ్ చౌహాన్, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రీస్ టాప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
Also Read: PBKS vs SRH Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం.. పంజాబ్ ఓటమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి