Shikhar Dhawan, Kane Williamson: కేన్ మామతో శిఖర్ ధావన్ బ్రోమాన్స్.. వీడియో వైరల్
Shikhar Dhawan, Kane Williamson Bromance: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి సిద్ధమవుతున్న శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్తో కలిసి చేసిన బ్రోమాన్స్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఇదే కదా అని క్రికెట్ ప్రియులు కూడా ఆ ఇద్దరినీ అభినందిస్తున్నారు.
Shikhar Dhawan, Kane Williamson Bromance: న్యూజిలాండ్ గడ్డపై కేన్ విలియమ్సన్ సేనపై టీ20 సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా టెంపరరీ కెప్టేన్ శిఖర్ ధావన్ ప్రస్తుతం మరో పోరుకు సిద్ధమవుతున్నాడు. న్యూజిలాండ్ తో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభానికి ముందుగా ట్రోఫీ ఆవిష్కరణ సందర్భంగా న్యూజిలాండ్ కేప్టేన్ కేన్ విలియమ్సన్, టీమిండియా కేప్టేన్ శిఖర్ ధావన్ మధ్య బ్రోమాన్స్ సన్నివేశాలు క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తామిద్దరం రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనో లేక క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులుగా మారి ట్రోఫీ కోసం తలపడబోతున్నామనే పోటీతత్వం ఏమాత్రం లేకుండా ఒకరికొకరు హత్తుకుంటూ, సరదాగా జోకులేసుకుంటూ, పరస్పరం అభినందించుకుంటూ క్రీడా స్పూర్తిని కనబర్చారు.
శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ మధ్య బ్రోమాన్స్ దృశ్యాలను బీసీసీఐ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఇదే కదా అని క్రికెట్ ప్రియులు కూడా ఆ ఇద్దరినీ అభినందిస్తున్నారు. ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్ల మధ్య బ్రోమాన్స్ సర్వసాధారణం. కానీ ప్రత్యర్థి దేశాల ఆటగాళ్ల మధ్య బ్రోమాన్స్ చాలా అరుదు. అప్పుడప్పుడు మాత్రమే కనిపించే సీన్ ఇది. అందుకే వీళ్లిద్దరి వీడియో వైరల్ అవుతోంది.
ఏదేమైనా ఐపిఎల్ పుణ్యమా అని ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు అందరికీ టీమిండియా ఆటగాళ్లతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయనుకోవచ్చు. ఐపిఎల్ టోర్నమెంట్స్ లో భాగంగా వివిధ జట్లలో వివిధ దేశాల ఆటగాళ్లతో కలిసిపోయి ఆడుతున్న ఆటగాళ్ల మధ్య సోదర భావం కనిపించిన సందర్భాలు గతంలో అనేకం చూశాం. ఇప్పుడు శిఖర్ ధావన్, కేన్ మామ బ్రోమాన్స్ కూడా అలాంటిదే.
ఇక ఇండియా vs న్యూజిలాండ్ జట్ల వన్డే సిరీస్ విషయానికొస్తే.. ఐసిసి వన్డే వరల్డ్ కప్‌కి ముందు జరుగుతున్న ఈ వన్డే సిరీస్ భారత జట్టు తమని తాము వరల్డ్ కప్‌కి సిద్ధం చేసుకోవడం కోసం ఎంతో ఉపయోగపడనుంది. మరోవైపు వన్డే సిరీస్ కూడా గెలుచుకుని జట్టులో జోష్ నింపడంతో పాటు కెప్టేన్‌గా తన ఎంపిక సరైనదే అని తనను తాను కూడా ప్రూవ్ చేసుకోవాలని శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.
Also Read : IND vs NZ: శాంసన్ ఇన్.. దీపక్, మాలిక్ డౌట్! న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే
Also Read : Dinesh Karthik Retirement: దినేష్ కార్తీక్ భావోద్వేగ వీడియో.. త్వరలోనే సంచలన నిర్ణయం!
Also Read : Suryakumar Yadav: అమ్మో సూర్యకుమార్ యాదవా.. మా దగ్గర అంత డబ్బు లేదు: మ్యాక్స్‌వెల్