Smriti Mandhana Bowilng Vs Virat Kohli: స్మృతి మందనకు, విరాట్ కోహ్లీకి ఐపిఎల్ జట్ల కెప్టేన్సీ విషయంలోనే కాదు.. మరో విషయంలోనూ ఇద్దరి మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని తేలింది. అదేంటో తెలుసుకోవడానికంటే ముందుగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధన కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు పరిస్థితి ఏంటో ఒక స్మాల్ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాదే తొలిసారిగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాగా.. మొదటి సీజన్‌లోనే స్మృతి మందన జట్టు పేలవమైన ప్రదర్శనతో టోర్నమెంట్‌లోంచి ఔట్ అయింది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లో కేవలం రెండంటే.. రెండే మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించి తీవ్ర విమర్శలపాలైంది. అందులోనూ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ప్లేయర్స్ జాబితాలోనూ స్మృతి మంధననే ముందుండటం ఆమెను మరింత విమర్శలపాలయ్యేలా చేసింది. 


జట్టు నిండా కీలకమైన ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వెనుకబడటం ఆ జట్టును ఇరకాటంలో పడేసింది. అందులోనూ సీజన్ ఆరంభంలోనే వరుసగా మ్యాచుల్లో ఓటమిపాలవడంతో జట్టుపై ఒత్తిడి కూడా ఎక్కువైంది.


ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతి మందన జట్టు పరిస్థితి ఇలా ఉంటే.. మంగళవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 17 ఓవర్లో స్మృతి మందన బౌలింగ్ చేయడానికి బంతిని పట్టుకుంది. ఈ సీజన్ మొత్తంలో స్మృతి బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి కాగా.. ఆమె బౌలింగ్ చేసిన తీరు ఇదే రాయల్ ఛాలెంజర్స్ జట్టు మెన్స్ టీమ్ స్కిప్పర్ విరాట్ కోహ్లీని గుర్తుచేస్తోందంటున్నారు నెటిజెన్స్. 



ఇదే విషయమై స్మృతి మందన బౌలింగ్ వీడియోను, విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసిన వీడియోను ఒక్క చోట చేర్చి పోలికలు కూడా మొదలుపెట్టారు. అచ్చం విరాట్ కోహ్లీ తరహాలోనే స్మృతి మందన బౌలింగ్ స్టైల్ ఉందంటూ పలువురు నెటిజెన్స్, క్రికెట్ ప్రియులు ట్వీట్స్, కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.