క్వాలిఫయర్-2లో సన్ రైజర్స్ చేతిలో పరజాయం తీవ్రంగా బాధించిందని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ తెలిపాడు. 'మా ఓపెనర్లు అద్భుతమైన ప్రారంభాన్నిచ్చారు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలవడం చాలా బాధాకరం. మేము సన్‌రైజర్స్ అనే జట్టు చేతిలో ఓడలేదు.. రషీద్ ఖాన్ చేతిలో ఓడిపోయాం' అని పేర్కొన్నాడు. అటు టోర్నీలో తమ జట్టు ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని దినేష్ వెల్లడించాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


19ఏళ్ల రషీద్ ఖాన్ అత్యుత్తమ ప్రదర్శనపై ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్పందించారు. 'ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ ప్రదర్శన అద్భుతమైనది, గర్వించదగినది. అతడిని చూసి అఫ్ఘన్ గర్వపడుతుంది. మా ఆటగాళ్లకు వారి నైపుణ్యాలను చూపించడానికి వేదికను ఇచ్చిన భారత మిత్రులకు నేను కూడా కృతజ్ఞుడను. అతను క్రికెట్ ప్రపంచానికి అరుదైన సంపద. అతన్ని మేము వదులుకోము' అంటూ రషీద్ ఖాన్‌ను కొనియాడుతూ ట్వీట్ చేశారు.



 


కాగా శుక్రవారం జరిగిన ఐపీఎల్-11వ సీజన్  క్వాలిఫయర్-2మ్యాచ్ లో హైదరాబాద్ విజయంలో రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 3 వికెట్లు తీశాడు. 2 క్యాచ్‌లు పట్టాడు. సన్‌రైజర్స్‌కు ఆశలే లేని స్థితిలో కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కాగా అటు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు 'మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అతడి ఆట ప్రదర్శనను పలువురు క్రికెటర్లు, ఆఫ్ఘనీ ప్రజలు మెచ్చుకుంటున్నారు. 2017 నుంచి ఇప్పటివరకూ అతడు సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నాడు.