టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) వ్యక్తిత్వంపై మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ (Gary Kirsten) స్పందించారు. గతంలో జరిగిన ఓ సంఘటనతో ధోనీ ఎలాంటి వాడో తెలిపారు. ఆ ఘటన తర్వాత ధోనీపై తన అభిప్రాయం మారిందన్నారు. భారత్‌ 2011లో వన్డే ప్రపంచ కప్ సాధించినప్పుడు మహీ కెప్టెన్ కాగా, అప్పటి ప్రధాన కోచ్ కిర్‌స్టెన్ అని తెలిసిందే. Corosure: అత్యంత చవకైన కరోనా టెస్ట్ కిట్‌ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ద ఆర్కే షో అనే యూట్యూబ్ ఛానల్‌‌ ఇంటర్వ్యూలో ధోనీ గురించి కిర్‌స్టెన్ (Gary Kirsten About MS Dhoni) మాట్లాడారు. ‘ నా జీవితంలో నేను కలిసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులో ధోనీ ఒకడు. అతడు గొప్ప క్రికెటర్, వ్యక్తి. అన్నింటికన్నా ముఖ్యంగా అతడి వినయ విధేయత అమోఘం. వరల్డ్ కప్ కన్నా కొన్ని రోజులముందు బెంగళూరులో ఓ ఈవెంట్ జరిగింది. టీమిండియాను ఫ్లైట్ స్కూల్‌కు ఆహ్వానించారు. అయితే ఎలా ఉంటుందో చూడాలని టీమిండియా విదేశీ సహాయక సిబ్బంది ఆశగా ఉన్నారు. ‘గంగూలీ పునాదితోనే MS Dhoniకి విజయాలు’


ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన నన్ను, ప్యాడీ ఆప్టన్, ఎరిక్ సిమన్స్‌లను బెంగళూరు ఫ్లైట్ స్కూల్‌లోపలికి అనుమతించలేదు. భద్రతా కారణాలరీత్యా అనుమతి కుదరదని చెప్పారు. దీంతో ధోనీ సహా టీమిండియా ఈవెంట్‌ను రద్దు చేసుకుంది. ఏ ఒక్క క్రికెటర్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. వీళ్లు నావాళ్లు. వీళ్లను అనుమతించకపోతే మేం(క్రికెటర్స్) కూడా ఈవెంట్‌కు వెళ్లే ప్రసక్తే లేదని ధోనీ అన్నాడు. ధోనీ గురించి చెప్పాలంటే ఆ ఒక్క ఘటన చాలని’ భారత్‌కు 2011 వరల్డ్ కప్ అందించిన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ చెప్పుకొచ్చారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


మ్యాచ్‌లు గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం. కానీ కష్టసమయాలలో వెన్నంటి ఉండటం చాలా ముఖ్యం. ధోనీ వ్యక్తిత్వం అందరికన్నా భిన్నంగా ఉంటుంది. ధోనీ చాలా విధేయతగా నడుచుకున్నాడు.  కోచ్‌గా నేను, కెప్టెన్‌గా మహీ.. మూడేళ్లు జట్టు కోసం కలిసి పనిచేయడంతో మా మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. జట్టు కోసం అదే విధంగా కలిసి పనిచేశామంటూ గత రోజులను కిర్‌స్టెన్ గుర్తుచేసుకున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..