Ipl Qualifier One 2022: ఐపీఎల్‌ 2022 చివరి ఘట్టానికి చేరుకుంది. మార్చి 26న ప్రారంభమైన లీగ్‌ మే 29తో ముగియనుంది. ఇప్పటివరకు జరిగిన 70 లీగ్‌ మ్యాచుల్లో పది జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. రేపు(మంగళవారం) తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్‌ టైటాన్స్‌ తో రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనుంది. కోల్‌ కతా లోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రేపు రాత్రి ఏడున్నరకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ కు వెళ్లనుంది. ఓడిన  జట్టు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో గెలిచిన జట్టుతో పోటీ పడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు రెండు కూడా బలంగా కనిపిస్తున్నాయి. 14 మ్యాచ్‌ లు ఆడిన గుజరాత్‌.. పదింట్లో గెలిచింది. అటు రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం తొమ్మిది మ్యాచుల్లో విజయంసాధించింది. దీంతో రెండు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌ రసవత్తరంగా జరగనుంది. హర్ధిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ ఆల్‌ రౌండ్‌ పర్ఫామెన్స్‌ తో అదరగొడుతుంది. హార్ధిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌,  డేవిడ్‌ మిల్లర్‌, వృద్ధిమాన్‌ సాహా, రాహుల్ తివాటియా, సాయి సుదర్శన్‌ లతో గుజరాత్‌ బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. ఇక బౌలింగ్‌ లోనూ గుజరాత్‌ దుమ్మురేపుతోంది. మహ్మద్‌ షమీ, లూకీ ఫెర్గూసన్‌, రషీద్‌ ఖాన్‌  ఆ జట్టుకు పెద్ద అసెట్‌ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రషీద్‌ ఖాన్‌ ఆడిన 14 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. షమీ సైతం18 వికెట్లు పడగొట్టాడు.


ఇక రాజస్థాన్‌ జట్టుకు జోస్‌ బట్లర్‌ కీ ప్లేయర్‌ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 మ్యాచ్‌ లు ఆడిన బట్లర్‌ 629 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతానికి బట్లర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ గా కూడా ఉన్నాడు. ఇక యశస్వీ జైశ్వాల్‌, కెప్టెన్‌ సంజూ సాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, హెట్‌ మెయిర్‌, రియాన్‌ పరాగ్‌ లతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఫుల్‌ స్ట్రాంగ్‌ గా కనిపిస్తోంది. అటు బౌలింగ్‌ విభాగంలో రాజస్థాన్‌ స్పిన్నర్‌ అదరగొడుతున్నాడు. 14 మ్యాచులు ఆడిన చాహల్‌ 26 వికెట్లు తీసి ప్రస్తుతానికి పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌ గా ఉన్నాడు.  ఇక బౌల్ట్‌తో పాటు ప్రసిద్ధ్‌ కృష్ణ, అశ్విన్‌ లతో రాజస్థాన్‌ డేంజరస్‌ గా కనిపిస్తుందనే చెప్పుకోవాలి.


ఇక లీగ్‌ దశలో ఈ రెండు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ లో గుజరాతే పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌ లో హర్ధిక్‌ పాండ్యా 87 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి మంగళవారం ఈ రెండు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.


Also Read: CM Jagan Tour: వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం..దావోస్‌లో సీఎం వైఎస్ జగన్‌ ప్రసంగం..!


Also Read: Vizag Bride Srujana: పెళ్లి ఆపాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది.. విశాఖ నవ వధువు కేసులో వీడిన మిస్టరీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.