Roger Federer exits Wimbledon 2021: వింబుల్డన్ 2021లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. రికార్డు స్థాయిలో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో 22వ సారి బరిలోకి దిగిన స్విస్ దిగ్గజం 14వ సీడ్‌ హుబర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌)ను అడ్డుకోలేకపోయాడు. ఫెడరర్‌కు ఇదే చివరి వింబుల్డన్ అవుతుందా అని టెన్నిస్ విశ్లేషకులు, ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో 8 పర్యాయాలు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ క్వార్టర్ ఫైనల్లో మునుపటి ఆటను ప్రదర్శించలేకపోయాడు. 6–3, 7–6 (7/4), 6–0 తేడాతో ఫెడరర్‌పై పోలాండ్ ఆటగాడు హుబర్ట్‌ హుర్కాజ్‌ విజయం సాధించాడు. మరోవైపు  హుర్కాజ్ తన కెరీర్‌లో తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకోవడం గమనార్హం. వూబర్ట్ దూకుడైన ఆటకు 39 ఏళ్ల ఫెడరర్ వద్ద సమాధానం లేకపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 404 సెట్లలో ఒక్క సెట్‌ను కూడా 6-0తో ఓడిపోని ఫెడరర్ క్వార్టర్ ఫైనల్లో తొలిసారిగా ఓ సెట్‌ను దారుణంగా కోల్పోయాడు. 


Also Read: Ben Stokes: ఇయాన్ మోర్గాన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదన్న బెన్ స్టోక్స్



1999లో వింబుల్డన్ ఆడటం ప్రారంభించిన స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెడరర్ గ్రాస్ కోర్టులో తొలిసారిగా 6-0తో ప్రత్యర్ధి ఆటగాడికి సెట్ కోల్పోయాడు. గ్రాస్ కోర్టులపై వరుసగా సెట్లలో విజయం సాధించిన నాలుగో ఆటగాడిగా పోలాండ్‌కు చెందిన హుబర్ట్ హుర్కాజ్ నిలిచాడు. రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న కోరిక తీరకుండానే వింబుల్డన్ టోర్నీ నుంచి ఫెడరర్ నిష్క్రమించాడు. తాను ఓడిపోవటం కన్నా, ఓడిన తీరే స్విట్జర్లాండ్ ఆటగాడిని తీవ్రంగా నిరాశపరిచింది. మరోవైపు మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ 6–3, 6–4, 6–4 తేడాతో ఫుచోవిచ్‌‌పై వరుస సెట్లలో గెలిచి పదోసారి వింబుల్డన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.


Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ బర్త్‌డే, టీమిండియా మాజీ కెప్టెన్‌కు శుభాకాంక్షల వెల్లువ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook