Chris Gayle: `ప్రధాని మోదీ మెసేజ్ తో నిద్ర లేచా`..: క్రిస్ గేల్
Chris Gayle: ప్రధాని మోదీ తనకు వ్యక్తిగత సందేశం పంపారని వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్‌గేల్ చెప్పాడు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
PM Narendra Modi-Chris Gayle: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ (Chris Gayle).. భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నుంచి తనకు వ్యక్తిగత సందేశం వచ్చిందని ట్వీట్ చేశాడు. అదే విధంగా ప్రధాని మోదీ..దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ (Jonty Rhodes) కు మెసేజ్ పంపారు.
" భారతీయులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్ మెసేజ్‌తో ఈరోజు నిద్ర లేచా. ఆయనతో సహా దేశప్రజలందరితో నాకు మంచి అనుబంధం ఉంది. యూనివర్స్ బాస్ నుంచి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ గేల్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
Also read: Yuvraj Singh-Hazel Keech: తండ్రయిన యువరాజ్ సింగ్... పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హేజెల్ కీచ్..
క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గేల్ (Chris Gayle) తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మన దేశంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. దీనిలో ఆర్‌సీబీ తరపున 91 మ్యాచ్‌ల్లో 3420 పరుగులు సాధించాడు. కోహ్లి, డివిలియర్స్ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్ నిలిచాడు. అయితే ఈ సారి ఐపీఎల్ (IPL) కు గేల్ దూరమయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook