Women Premier League 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభానికే ముందే వివాదాస్పదమైంది. తొలి మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు గాయం కారణంగా వెస్టిండీస్‌కు చెందిన డియాండ్రా డాటిన్ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌ని జట్టులోకి తీసుకున్నట్లు గుజరాత్ జెయింట్స్ ప్రకటించింది. అయితే తాను ఫిట్‌గా ఉన్నానంటూ డాటిన్ సోషల్ మీడియాలో ప్రకటించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెను జట్టు నుంచి తొలగించడానికి గల కారణాలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆదివారం గుజరాత్ జెయింట్స్ క్లారిటీ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాటిన్‌కు తప్పనిసరి మెడికల్ క్లియరెన్స్ పొందలేకపోయామని చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె లీగ్ మొత్తానికి దూరమైందని.. మెడికల్ క్లియరెన్స్ పొందిన తర్వాత డబ్యూపీఎల్ వచ్చే ఎడిషన్‌లలో ఆమె జట్టులో భాగమవుతుందని పేర్కొంది. 


"డాటిన్ ప్రపంచ స్థాయి ప్లేయర్. దురదృష్టవశాత్తూ ఈ సీజన్‌లో నిర్ణీత గడువు కంటే ముందే మేము మెడికల్ క్లియరెన్స్ పొందలేకపోయాము. డబ్ల్యూపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లందరికీ ఇటువంటి అనుమతులు తప్పనిసరి. ఆమె త్వరలోనే మైదానంలోకి తిరిగి వచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఆమె మెడికల్ రిపోర్టు క్లియరెన్స్‌కు లోబడి రాబోయే సీజన్‌లలో గుజరాత్ జెయింట్స్ జట్టులో భాగమవుతుంది" అని గుజరాత్ జెయింట్స్ ప్రకటనలో పేర్కొంది. అయితే ఆమె గాయానికి సంబంధించి ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. 


 




వెస్టిండీస్ తరపున 143 వన్డేలు, 127 టీ20 మ్యాచ్‌లు ఆడిన డాటిన్‌ను గత నెల జరిగిన వేలంలో గుజరాత్ జెయింట్స్ రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. ఆమె సీజన్‌కు దూరమవ్వడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. మొదటి మ్యాచ్‌లో కెప్టెన్ బెత్ మూనీ కూడా గాయపడింది. డాటిన్ లేని లోటు తొలి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ముంబై ఇండియన్స్‌ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్‌పై ముంబై 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 


డాటిన్ స్థానంలో జట్టులోకి వచ్చిన కిమ్ గార్త్‌ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది. వార్మప్ మ్యాచ్‌లలో మాత్రమే ఆడింది. మెయిన్ మ్యాచ్‌లలో ఆమెకు అవకాశం రాలేదు. అయినా డాటిన్ వంటి స్టార్ ప్లేయర్‌కు రీప్లేస్‌మెంట్‌గా అనూహ్యంగా గుజరాత్ జట్టులోకి తీసుకోవడం గమనార్హం. ఐర్లాండ్ దేశస్తురాలైన గార్త్.. మొదట్లో తన దేశం తరుఫున ఆడింది. ఆ తరువాత మెల్‌బోర్న్ స్టార్స్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుని.. ఆస్ట్రేలియా పౌరసత్వం పొందింది. 


Also Read: Urinated In American Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. మద్యం మత్తులో నిద్రపోతూ..  


Also Read: Zoom Layoffs: జూమ్ సంచలన నిర్ణయం.. ఆకస్మికంగా అధ్యక్షుడికి ఉద్వాసన   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook