Celebration of West Indies Women after qualifying ICC Womens World Cup 2022 Semis: న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భారత్ ప్రస్థానం ముగిసిన విషయం తెలిసిందే. గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో భారత్ సెమీస్‌ పోరుకు అర్హత సాధించలేక ఇంటి ముఖం పట్టగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో పాటుగా వెస్టిండీస్ సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 7 పరుగులు అవసరం అవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరింది. క్రీజులో మిగ్నాన్‌ డుప్రీజ్‌ ఉండడంతో మ్యాచ్ ప్రొటీస్ జట్టుదే అని అందరూ అనుకున్నారు. తొలి బంతికి డుప్రీజ్‌ సింగిల్‌ తీయగా .. రెండో బంతికి చెట్టీ పెవిలియన్ చేరింది. దాంతో సమీకరణం నాలుగు బంతుల్లో 5 పరుగులుగా మారింది. మూడో బంతికి డుప్రీజ్‌ సింగల్ తీయగా.. నాలుగో బంతికి ఇస్మాయిల్ ఓ పరుగు తీసింది. ఇక ఐదో బంతికి డుప్రీజ్ భారీ షాట్‌ ఆడి.. హర్మన్‌ప్రీత్‌ చేతికి చిక్కింది. అయితే అది నోబాల్‌ కావడంతో డుప్రీజ్‌ బతికిపోగా.. ఓ ఎక్స్ట్రా రన్ వచ్చింది. చివరి రెండు బంతులకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సింగిల్స్‌ తీసి భారత్‌ను ఓడించారు.



దక్షిణాఫ్రికాపై భారత్ ఓడితేనే వెస్టిండీస్ సెమీస్ చేరుతుంది. అందుకే భారత్, దక్షిణాఫ్రికా మ్యాచును వెస్టిండీస్ మహిళలు ఒక్క బంతి కూడా మిస్ అవ్వకుండా చూశారు. చివరి ఓవర్లో విండీస్ మహిళల టెన్షన్ తారా స్థాయికి చేరింది. ఒక్కోబంతి పడుతుంటే.. వారి టెన్షన్ ఇంకా ఎక్కువైంది. చివరి బంతికి భారత్ ఓడిపోగానే.. డ్రెసింగ్ రూంలో ఒక్కసారిగా అరిచారు. ఒకరిని మరొకరు ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్స్ అయితే నానా హంగామా చేశారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది.  


Also Read: Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయిన స్టార్ బ్యాటర్! ఏబీడీకి ఛాన్స్!!


Also Read: Rain in Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం... పలుచోట్ల వర్షం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook