భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ రద్దు; కివీస్ ఫుల్ హ్యాపీ !!
వరల్డ్ కప్ లీగ్ దశలో భాగంగా భారత్ - కివీస్ మ్యాచ్ లో వరణుడే పై చేయి సాధించాడు..
ఉత్కంఠ భరితంగా సాగుతుందుకున్న భారత్-కివీస్ మ్యాచ్ లో ఎవరూ పై చేయి సాధించలేకపోయారు. వాతావరణం అనుకూలించని కారణంగా వరణుడికి సమర్పించుకోవాల్సి వచ్చింది. వర్షం ఆగినప్పటికీ పిచ్ తేమగా ఉండటం వల్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని రిఫరీ తేల్చడంతో భారత్-కివీస్ జట్లకు చెరో ఒక పాయింట్ కేటాయించారు.
కివీస్ ఫ్టస్..భారత్ థార్డ్
తాజా పరిణామంతో పాయింట్ల పట్టికలో 7 పాయింట్లు సాధించి కివీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా 5 పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో కొసాగుతోంది. అయితే కివీస్ కి ఇది నాల్గో మ్యాచ్ కాగా..భారత్ కు మూడో మ్యాచ్ మాత్రమే.కాగా ఈ మ్యాచ్ ఫలితం రాకపోవడంతో భారత్ విషయం అంటుంచితే కివీస్ జట్టు మాత్రం సంబరాలు చేసుకుంటోందట. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన భారత్ తో ఢీకొట్టి ఓటమిపాలయ్యేకంటే కనీసం ఒక పాయింటన్న దక్కికున్నమని ఆ జట్టు సభ్యులు హ్యాపీగా ఫీలౌతున్నారట.
వరుణుడిదే అగ్రస్థానం
ఇదిలా ఉండగా ఇప్పటికీ వరకు జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో వరుణుదే అగ్రస్థానంలో నిలబడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన లీగ్ మ్యాచుల్లో నాల్గు మ్యాచులు రద్దయ్యాయి. అంటే వరణుడి ఖాతాలో 8 పాయింట్లు వచ్చి చేరాయన్న మాట. ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఏ జట్టు సాధించలేదు.వరణుడా మాజాకా..!