అంబరాన్నంటిన వరల్డ్ కప్ ఆరంభ వేడుకలు
![అంబరాన్నంటిన వరల్డ్ కప్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటిన వరల్డ్ కప్ ఆరంభ వేడుకలు](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2019/05/30/178592-icc-cricket-world-cup-2019-world-cup-teams-icc-world-cup-2019-schedule.jpg?itok=kgZJiuW_)
క్రికెట్ వరల్డ్ కప్ 12వ ఎడిషన్ గురువారం (మే 30) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి ఎదురుగా ఉన్న ‘ది మాల్’లో జరిగిన టోర్నమెంట్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా ఆతిథ్య దేశం ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య గురువారం తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ షో చూసేందుకు వచ్చే క్రికెట్ ప్రియులకు బ్యాలెట్ సిస్టమ్ ద్వారా టికెట్లను అందించారు. దాదాపు 4వేల మంది అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు.
లండన్: క్రికెట్ వరల్డ్ కప్ 12వ ఎడిషన్ గురువారం (మే 30) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి ఎదురుగా ఉన్న ‘ది మాల్’లో జరిగిన టోర్నమెంట్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా ఆతిథ్య దేశం ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య గురువారం తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ షో చూసేందుకు వచ్చే క్రికెట్ ప్రియులకు బ్యాలెట్ సిస్టమ్ ద్వారా టికెట్లను అందించారు. దాదాపు 4వేల మంది అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న పది దేశాలకు చెందిన కెప్టెన్లను ఒకరి తర్వాత మరొకరిని వేదికపైకి ఆహ్వానించగా ఆ తర్వాత ప్రముఖ గాయనీ గాయకులు తమ గానాలతో, డ్యాన్సర్లు తమ నృత్యాలతో వీక్షకులను ఆలరించారు.